పారిపోతున్న వరున్ని వెంబడించి పట్టుకుంది.. ఆపై పెళ్లిచేసుకుంది

పారిపోతున్న వరున్ని వెంబడించి పట్టుకుంది.. ఆపై పెళ్లిచేసుకుంది

పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధువు, వరుడు కాసేపట్లో భార్యభర్తలుగా మారనున్నారు. అంతలోనే వరుడు కనిపించకుండా పోయాడు. వరుడు కావాలనే పెళ్లిని నిరాకరించి పారిపోతున్నాడని తెలుసుకున్న వధువు అతన్ని 20 కిలోమీటర్లు వెంబడించి పట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.

క్వీన్‌ సినిమాలో, కంగనా రనౌత్ , ఆమె కాబోయే భర్త వివాహం నుండి వైదొలిగిన తర్వాత ఒంటరిగా హనీమూన్‌కు వెళుతుంది. అయితే ఈ బరేలీ రాణి మాత్రం ఒంటరిగా హనీమూన్‌కు వెళ్లేందుకు నిరాకరించింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఆమె తన 'పారిపోయిన వరుడిని' వెంబడించి మరీ పెళ్లిచేసుకుంది. బారాబంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ సంఘటన జరిగింది.

బదౌన్ జిల్లాకు చెందిన వ్యక్తితో ఆ మహిళ రెండున్నరేళ్లుగా శృంగార సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఎట్టకేలకు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లికి తేదీని నిర్ణయించారు. ఆదివారం భూతేశ్వర్ నాథ్ ఆలయంలో ఈ జంటకు వివాహం జరుగనుంది. అయితే, పెళ్లి రోజు వివాహ మండపానికి వరుడు చేరుకోకపోవడంతో వదువు అనుమానపడింది. చివరకు తన కాబోయే భర్తకు ఫోన్ చేసింది. అతను తన తల్లిని తీసుకురావడానికి బుదౌన్‌కు వెళ్తున్నానని సాకుగా చెప్పాడు.

విషయం విన్న వెంటనే వరుడు పెళ్లి చేసుకోకుండా పారిపోవాలని భావిస్తున్నాడని మహిళకు అనుమానం వచ్చింది. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా, బరేలీకి 20 కి.మీ దూరంలో ఉన్న భీమోరా పోలీస్ స్టేషన్ దగ్గర బస్సు ఎక్కుతుండగా ఆమె అతడిని వెంబడించి పట్టుకోగలిగింది. తిరిగి ఆలయానికి తీసుకువచ్చి పెళ్లిచేసుకుంది. ఇరు కుటుంబాల సమక్షంలో భీమోర ఆలయంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ బదౌన్ రాణికి ఒంటరిగా కాకుండా తన భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లే అవకాశం ఉంది.

Tags

Next Story