Toll System: హైవేపై ఇక ఆగేదే లే..,.

Toll System: హైవేపై ఇక ఆగేదే లే..,.
సరికొత్త టోల్‌ విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు... టోల్‌గేట్ల వద్ద క్షణం కూడా ఆగకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు...

జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సరళతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు (Union government is planning) తీసుకుంటోంది. ఇప్పటికే టోల్‌గేట్ల వద్ద వాహనదారులు వేచి చూడకుండా( reduce waiting time at plazas) ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం మరో కీలక విధానాన్ని తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఈ విధానం అమలైతే ఇక టోల్‌గేట్ల( toll gates) వద్ద ఆ కొద్దిసేపు కూడా ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.


జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్‌ వ్యవస్థ(New Toll System In India‌)ను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ దిశగా అవరోధం లేని టోల్‌ వ్యవస్థను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ట్రయల్స్( pilot project) విజయవంతమైన వెంటనే దానిని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్( Minister of State (MoS) for Road Transport and Highways VK Singh) వెల్లడించారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే వాహనదారులు టోల్‌ బూత్‌ల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదని వీకే సింగ్‌ తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా పౌరులకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది" అని ఆయన అన్నారు.


హైవేలపై టోల్‌ప్లాజాల వద్ద బ్యారియర్లు లేని వ్యవస్థ(Barrier-less toll system)ను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే.. ప్రయాణికులు టోల్‌గేట్‌ దగ్గర కనీసం అర నిమిషం అయినా ఆగాల్సిన పని లేకుండా హైవేపై దూసుకుపోవచ్చు. రహదారులపై ప్రయాణించిన దూరానికే ఛార్జీలు వసూలు చేసే విధానం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని వీకేసింగ్‌ తెలిపారు.

కొత్త టోల్‌ వ్యవస్థ వల్ల కిలోమీటర్‌ ఆధారంగా చెల్లింపులు చేయొచ్చని మంత్రి వీకే సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ఢిల్లీ - మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌ వే(Delhi-Meerut Expressway )లో ఆధునిక సాంకేతికత ఆధారంగా పరీక్షిస్తున్నామని, ప్రయాణికుడు జాతీయ రహదారిలోకి ప్రవేశించిన వెంటనే.. వాహనం నంబర్ ప్టేట్‌ ఆధారంగా కెమెరాలు స్కాన్ చేసి, డేటాను సేకరిస్తాయని ఆయన తెలిపారు. ఆ విధంగా ప్రయాణించిన దూరానికే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, అయితే టోల్‌ నిబంధనల ప్రకారమే ఈ ఛార్జీలు ఉంటాయని కేంద్రమంత్రి తెలిపారు.

గతంలో ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించామని, ప్రస్తుతం ప్రభుత్వం దానిని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్రమంత్రి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story