LK advani: అద్వానీకి భారత రత్న ప్రదానం..
ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భారతరత్న కొరకు మొత్తం ఐదు మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను తాజాగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో భారతరత్న అవార్డులను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ కార్యక్రమానికి అనారోగ్య సమస్యల కారణంగా ఉప ప్రధానిగా చేసిన అద్వానీ హాజరు కాలేకపోయాడు. దాంతో నేడు ఆయన ఇంటికి వెళ్లి మరీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ భారతరత్నను LK అద్వానికి అందించారు.
అనారోగ్య సమస్యల కారణంగా ఈ కార్యక్రమానికి ఆడ్వాణీ హాజరుకాలేకపోయారు. దీంతో ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఆడ్వాణీ నివాసానికి వెళ్లారు. భారత రత్న అవార్డును ఆడ్వాణీకి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అద్వానికి భారతరత్నం రావడం చాలా సంతోషంగా ఉందని., ఆయనకు ఈ గౌరవం దక్కినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పకోచ్చారు. అద్వానీ అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధానిగా దేశానికి సేవలందించే స్థాయికి ఎదిగిన జీవితం ప్రజలకు స్ఫూర్తిదాయకమందు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా, అవిభక్త భారతదేశంలోని కరాచీలో జన్మించిన ఆడ్వాణీ పద్నాలుగేళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరారు. హైదరాబాద్ (ప్రస్తుతం పాక్ లో ఉన్న సిటీ) లో న్యాయ విద్య పూర్తిచేశారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డారు. 1970లో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు.
1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అదే ఏడాది కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1980లో జనతా పార్టీ తరఫున రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఆడ్వాణీ.. అయోధ్య రథయాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రామజన్మభూమి ఉద్యమానికి ఈ యాత్ర ప్రాణం పోసిందని రాజకీయ వర్గాల ఉవాచ. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఆడ్వాణీ.. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.
ఇక అద్వానీ నవంబర్ 8, 1927 పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. ఆపై 1980లో బిజెపి పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు అనేక మార్లు పార్టీ అధ్యక్షులుగా పని చేశారు. 1999 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్న సమయంలో అద్వాని హోంమంత్రి, ఒక ప్రధానిగా దేశానికి సేవలు అందించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com