మొబైల్ యాప్స్ తో జాగ్రత్త.. ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక

ఏ అవకాశం దొరికినా ఎవరిని ఎలా బురిడీ కొట్టించి సొమ్ము చేసుకుందామా అని ఆలోచిస్తుంటారు సైబర్ నేరగాళ్లు.. ప్రస్తుత రోజుల్లో ఇళ్లలోకి చొరబడి దోచుకునే దొంగలకంటే టెక్నాలజీని ఉపయోగించుకుని ఆన్ లైన్ చోరీలకు పాల్పడే వారి సంఖ్య ఎక్కువైంది. ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రైల్వే ప్రయాణీకులను ఐఆర్‌సీటీసీ హెచ్చరిస్తోంది.
ఈజీ మనీ కోసం రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు ఐఆర్‌సీటీసీ పేరుతో ఫేక్ యాప్ లను సృష్టిస్తున్నారని తెలిపింది. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తోంది. ముఖ్యంగా రైల్ కనెక్ట్ అనే యాప్ ని ఉపయోగించవద్దని హెచ్చరించింది. సైబర్ కేటుగాళ్లు ఫిషింగ్స్ లింక్స్ సాయంతో డబ్బుల్ని కాజేస్తున్నట్లు తెలిపింది.
ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లో ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉన్న అధికారిక ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్ లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది. తద్వారా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చని వివరించింది.
వినియోగదారులు ఒరిజినల్ ఐఆర్‌సీటీసీకి, ఫేక్ ఐఆర్‌సీటీసీకి తేడా గుర్తించగలగాలని తెలిపింది. యాప్ పనితీరు, ఇంటర్ ఫేస్ లాగిన్ వివరాలు, చెల్లింపు సమాచారం, వ్యక్తిగత డేటా వంటి గోప్యమైన వివరాలు దొంగిలించే అవకాశం ఉందని సూచించింది. కొంతమంది మోసగాళ్లు భారీ స్థాయిలో యాప్ వినియోగదారులకు ఫిషింగ్ లింక్ లను పంపుతున్నట్లు తేలింది. దీంతో ఐఆర్‌సీటీసీ వినియోగదారులను అప్రమత్తంగా ఉండమని ట్వీట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com