Beating Retreat: కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ

Beating Retreat:   కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ
X
గేట్లు తెరవడం, హ్యాండ్‌షేక్ లేకుండానే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం

పంజాబ్‌లోని మూడు ప్రాంతాల్లో ఇవాళ బీటింగ్ రిట్రీట్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య గ‌త 10 రోజుల నుంచి కాల్పుల విమ‌ర‌ణ అమ‌లులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ప‌ది రోజుల గ్యాప్ త‌ర్వాత మ‌ల్లీ బోర్డ‌ర్ సెక్యూర్టీ ద‌ళాలు బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ నిర్వ‌హించ‌నున్నాయి. అయితే పూర్తి స్థాయిలో కాకుండా, స్వ‌ల్ప స్థాయిలో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్నారు. పాకిస్థాన్‌తో ఉన్న స‌రిహ‌ద్దుల్లో అత్తారి-వాఘా, హుస్సేనివాలా, ఫ‌జిల్కా వ‌ద్ద బీటింగ్ రిట్రీట్ జ‌రుగుతుంది.

బీటింగ్ రిట్రీట్ స‌మ‌యంలో పాకిస్థానీ వైపు ఉన్న బోర్డ‌ర్ గేట్ల‌ను తెర‌వ‌బోమ‌ని అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో క‌ర‌చాల‌నం ఉండ‌ద‌న్నారు. కానీ బీటింగ్ రిట్రీట్ కార్య‌క్ర‌మాన్ని వీక్షించే అవ‌కాశాన్ని ప్రేక్ష‌కులు క‌ల్పించారు. ఇవాళ సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. అమృత్‌స‌ర్‌కు స‌మీపంలో ఉన్న అత్తారి బోర్డ‌ర్‌తో పాటు ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనివాలా, ఫ‌జిల్కాలోని స‌ద్కి బోర్డ‌ర్ వ‌ద్ద బీటింగ్ రిట్రీట్ ఉంటుంది. 5.30 నిమిషాల‌కు భారీ సంఖ్య‌లో స‌ద్కీ బోర్డ‌ర్‌కు చేరుకోవాల‌ని స్థానికుల‌కు బోర్డ‌ర్ ఏరియా డెవ‌ల‌ప్మెంట్ ఫ్రంట్ పిలుపునిచ్చింది.

అత్తారి బోర్డ‌ర్ వ‌ద్ద 1959 నుంచి బీటింగ్ రిట్రీట్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆ స‌మ‌యంలో రెండు దేశాల జాతీయ ప‌తాకాల‌ను అవ‌న‌త‌నం చేస్తారు. సాధార‌ణంగా బోర్డ‌ర్ వ‌ద్ద దివాళీ, ఈద్‌, గ‌ణ‌తంత్ర‌, స్వాతంత్య్ర దినోత్స‌వ రోజుల్లో స్వీట్లు పంచుకుంటారు. అమృత్‌స‌ర్‌కు 30 కిలోమీట‌ర్ల దూరంలో, లాహోర్‌కు 22 కిలోమీట‌ర్ల దూరంలో అత్తారి-వాఘా బోర్డ‌ర్ ఉన్న‌ది. ఇక్క‌డ బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ వీక్షించేందుకు 25 వేల మంది సామ‌ర్థ్యం క‌లిగిన గ్యాల‌రీ ఉన్న‌ది.

Tags

Next Story