"అందమైన ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది": భార్య వర్ధంతి సందర్భంగా శశి థరూర్

కాంగ్రెస్ నేత శశిథరూర్ బుధవారం ఆయన భార్య సునంద పుష్కర్ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు. కాంగ్రెస్ నేత శశిథరూర్, సునంద పుష్కర్ 2010లో కేరళలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకే సునంద పుష్కర్ (51) జనవరి 17, 2014న ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో శవమై కనిపించారు. ఆ సమయంలో థరూర్ అధికారిక బంగ్లాను పునర్నిర్మిస్తున్నందున ఈ జంట హోటల్‌లో బస చేశారు.
హోటల్ లిల్లీ ప్యాలెస్‌లోని సూట్‌లో ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. సునంద మరణాన్ని మొదట ఆత్మహత్యగా పరిగణించారు. కాని తరువాత ఆమెని హత్య చేసినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ తన భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించారు.
వీరిద్దరూ 2010లో కేరళలోని ఎలవంచెరిలో థరూర్ పూర్వీకుల ఇంటిలో మలయాళీ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. థరూర్‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని క్రూరత్వం మరియు ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి నిబంధనల ప్రకారం అభియోగాలు మోపారు. అయితే థరూర్ తన భార్య మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ప్రమేయం లేదని తీవ్రంగా ఖండించారు. ఆ కేసు ఫైలైన ఆరేళ్ల తరువాత 2021లో థరూర్ కేసు నుంచి బయటకు వచ్చారు.
నెటిజన్లు శశి థరూర్ పోస్ట్ పై విమర్శలు గుప్పించారు.
శశి థరూర్ పోస్ట్‌పై వినియోగదారులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒక వినియోగదారుడు.. 'ఈ డ్రామాను ఆపండి, మీరు ఏం చేశారో మీకు తెలుసు' అని అన్నారు. మరొక వినియోగదారుడు.. 'అయితే ఆమె మరణం యొక్క మిస్టరీ ఇప్పటికీ మీ చుట్టూ మరియు మీ ఆస్తి చుట్టూ తిరుగుతోంది. దీనిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు.. మరొక వినియోగదారుడు.., 'నిజం, ఎప్పటికీ బయటకు రాదు' అని అన్నారు.
Ten years.
— Shashi Tharoor (@ShashiTharoor) January 17, 2024
A beautiful soul lives forever.
Om Shanti. pic.twitter.com/lOTIN8qvNN
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com