Bedroom Jihadis: కశ్మీర్‌లో బెడ్‌రూం జిహాదీలు..

జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టులతో ఏళ్ల తరబడి ప్రత్యక్ష పోరాటం చేస్తున్న భద్రతా దళాలకు ప్రస్తుతం రహస్య శత్రువులను ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇంట్లోనే కూర్చుని సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ.. వర్గ విభేదాలను రెచ్చగొడుతున్న బెడ్‌రూం జిహాదీల రూపంలో వారికి ఛాలెంజ్ విసిరుతున్నారు. సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ దుర్మార్గులు కశ్మీర్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఈ అల్లర్లు సృష్టంచడానికి సోషల్ మీడియాలో అనేక ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసినట్లు గుర్తించారు.
అయితే, కశ్మీర్ లోయలో మత కలహాలు, అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతో దుష్ప్రచారం, రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాల నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారు. ఈ ఖాతాలను పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థలు, వాటి సానుభూతిపరులు నియంత్రిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా కొనసాగుతున్న దర్యాప్తులో అధికారులు వేలాది సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లు, ప్రైవేట్ మెసేజ్‌లను పరిశీలించారు. ఈ విశ్లేషణలో పాక్‌లో ఉన్న హ్యాండ్లర్లకు ఈ సంఘ విద్రోహక గుంపులకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలు లభించాయి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల సహాయంతో ఈ ‘జిహాదీలు’ ఎక్కడి నుంచైనా యుద్ధం చేస్తారు, వదంతులు వ్యాప్తి చేస్తూ యువతను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అధికారులు తెలిపారు.
ఇక, ఓ సోషల్ మీడియా పోస్టుల ద్వారా స్థానికంగా ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టారు.. కానీ.. శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. మరో కేసులో.. ఓ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో లీకయ్యాయని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఓ యువకుడిని అరెస్టు చేసి ఎంక్వైరీ చేయగా.. పాక్ నుంచి తనకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నాడని సదరు అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com