Bengalore: విషాదంగా మారిన అమ్మ ప్రసూతి ఫోటోషూట్.. మూడేళ్ల కొడుకు మృత్యువాత

Bengalore: విషాదంగా మారిన అమ్మ ప్రసూతి ఫోటోషూట్.. మూడేళ్ల కొడుకు మృత్యువాత
X
సెలబ్రెటీలు చేసే పనే తాము చేద్దామనుకున్నారో ఏమో.. ఒకప్పుడు గర్భవతి అంటే సీమంతం అప్పుడు మాత్రమే ఫోటోలు తీసేవారు.. ఇప్పుడు ప్రసవానికి ముందు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొన్ని ఎబ్బెట్టుగా ఉంటే, మరికొన్ని హూందాగా ఉంటాయి. ఏదేమైనా ఆ ఫోటో షూటే మూడేళ్ల బిడ్డ ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది.

బెంగళూరులో తల్లి ప్రసూతి ఫోటోషూట్ సందర్భంగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. చరణ్ మరియు స్వాతి దంపతుల కుమారుడు లక్ష్మీర్. శనివారం నాడు ఎనిమిది నెలల గర్భవతి అయిన స్వాతి తన రెండవ బిడ్డ రాకకు సిద్ధమవుతూ ఫోటోషూట్‌లో పాల్గొంటుండగా ఈ సంఘటన జరిగింది.

సమాచారం ప్రకారం, ఫోటోషూట్ జరుగుతుండగా, సమీపంలో ఆడుకుంటున్న లక్ష్మీర్ జారిపడి ఆ ప్రదేశంలో ఏర్పడిన చిన్న నీటి కొలనులో పడిపోయాడు. అక్కడ ఉన్నవారు గమనించలేదు. సమయానికి అతడికి సహాయం అందలేదు. దాంతో ఆ పిల్లవాడు మునిగిపోయాడు.

స్విమ్మింగ్ పూల్ లో అతడిని గుర్తించిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే బిడ్డ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు వైద్యులు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పరీక్ష నిర్వహించారు. ఈ ఘటనకు దారితీసిన సంఘటనలను అర్థం చేసుకోవడానికి, ఫోటోషూట్ సమయంలో ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా లేదా అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఉద్యోగం కోసం విదేశాల్లో ఉన్న చిన్నారి తండ్రి ఈరోజు బెంగళూరుకు తిరిగి వస్తారని అధికారులు తెలిపారు.

Tags

Next Story