Bengaluru: రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు..

Bengaluru: రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు..
X
బెంగళూరులో తప్పిన ఘోర బస్సు ప్రమాదం

బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు వేగంగా దూసుకుపోతుండగా ఒక్కసారిగా డ్రైవర్ కిరణ్ కుమార్‌కు (40) గుండెపోటు వచ్చింది. వెంటనే ఎడమ వైపునకు ఒరిగిపోయాడు. మరోవైపు బస్సు వేగంగా దూసుకెళ్తూ.. పక్కనున్న బస్సును ఢీకొట్టి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన కండక్టర్ ఓబలేష్.. డ్రైవర్ సీటుపైకి దూకి స్టీరింగ్‌ను నియంత్రించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు (రూట్ 256 M/1) నేలమంగళ నుంచి దసనాపుర డిపోకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. బస్సులోని సీసీటీవీ రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

కండక్టర్… చాకచక్యంగా బస్సును నియంత్రించడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. డ్రైవర్ మృతికి ఆర్టసీ సంస్థ సంతాపం తెలిపింది. కుటుంబ సభ్యులను పరామర్శించారు. నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఉద్యోగుల భద్రతపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Tags

Next Story