Bengaluru: పూలకుండీలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న ఆదర్శ dampatulu

ఫేస్‌బుక్ పోస్టుతో విషయం వెలుగులోకి..

బెంగళూర్‌లో ఓ జంట తమ అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీలోనే గంజాయి సాగు మొదలుపెట్టారు. సిక్కింకి చెందిన ఈ జంటన బెంగళూర్‌లో తాము నివాసం ఉంటున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. సిక్కింకి చెందిన కె. సాగర్ గురుంగ్ (37), అతని భార్య ఊర్మిళ కుమారి (38) తమ బాల్కనీలోని రెండు కుండీల్లో అలంకార మొక్కలతో పాటు గంజాయిని నాటారు.

అయితే, ఇటీవల ఉర్మిత తన బాల్కనీలో పెంచుతున్న వివిధ మొక్కలతో పాటు గంజాయి మొక్కల్ని చూపిస్తూ ఫేస్‌బుక్ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది వైరల్‌గా మారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉర్మిళ బంధువు ఒకరు పోలీసులు వచ్చేలోపు కుండీలోని గంజాయి మొక్కల్ని తీసిపారేయాలని సూచించాడు. అయితే, పోలీసులు కుండీల్లో గంజాయి ఆకుల్ని గుర్తించారు.

54 గ్రాములు ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరింత విచారించగా, లాభసాటిగా విక్రయించాలనే ఆలోచనతోనే గంజాయిని పెంచుతున్నట్లు దంపతులు అంగీకరించారు. వీరు గంజాయిని అమ్ముతున్నారో లేదో తెలుసుకోవడానికి వారి మొబైళ్లను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Next Story