Bengaluru: సలహాలు నచ్చక చంపేశాడు

Bengaluru: సలహాలు నచ్చక చంపేశాడు
బెంగళూరులో ఐటీ ఆఫీస్‌ జంట హత్యల కేసులో ముగ్గురిని అరెస్ట్

బెంగళూరులో జరిగిన జంట హత్యల కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్ లను హత్య చేసిన కంపెనీ మాజీ ఉద్యోగి ఫిలిక్స్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనే ఐటీ కంపెనీ ఎండీ, సీఈవో లను మాజీ ఉద్యోగి ఆ దారుణంగా హతమార్చాడు. కంపెనీలోకి ప్రవేశించిన ఫెలిక్స్ తన వెంట తెచ్చుకున్న కత్తితో వీరిద్దరినీ నరికాడు. తీవ్రంగా గాయపడ్డ వీద్దరినీ కంపెనీ ఇతర ఉద్యోగులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే వీరు ప్రాణాలు కోల్పోయారు.


అమృతహళ్లిలో ఉన్న పంపా ఎక్స్ టెన్షన్ లో ఈ ఐటీ కంపెనీ ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాజీ ఉద్యోగి శబరీష్ అలియాస్ ఫెలిక్స్, గతంలో ఈ కంపెనీ ఉద్యోగి. తమ కొత్త కంపెనీ కస్టమర్లను, ఉద్యోగులను వీరు ఇద్దరు లాక్కొంటున్నారనే అక్కసుతోనే వారిని చంపినట్లు అంగీకరించారు. నిజానికి శబరీష్ కొత్త కంపెనీలోని పలు లోపాలపై ఫణీంద్ర తరచూ మాట్లాడేవాడు. దీంతో ఫణింద్ర తన కస్టమర్లను, ఉద్యోగులను లాక్కొనేందుకు యత్నించాడని భావించి అతనిపై కక్ష పెంచుకొన్నాడు శబరీష్. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద కత్తి తీసుకొని ఫణీంద్రను అతడి కంపెనీలోనే హత్య చేశాడు. అరుపులు వినిపించడంతో వినుకుమార్ అక్కడికి చేరుకొన్నాడు. దీంతో శబరీష్ అతడిపై కూడా దాడి చేసి హతమార్చాడు.





ఈ హత్యతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు వినయ్ రెడ్డి, సంతోష్ లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. జాక్ ఫిలిక్స్ సామాజిక మాధ్యమాల్లో తనను తాను ఒక కన్నడ ర్యాపర్ గా అభివర్ణించుకున్నాడు. అతడికి దాదాపు 16 వేల మంది ఫాలోవర్లున్నారు. జంట హత్యల తర్వాత కూడా అతను ఇన్స్టాలో పోస్టులు చేయడం మానలేదు.. సరికదా హత్యల్లో తన ప్రమేయంపై వచ్చిన టీవీ వార్త స్క్రీన్ షాట్స్ కూడా పోస్టు చేశాడు. హత్యకు ముందు కూడా ఈ ప్రపంచం మొత్తం మోసగాళ్లు, కపట పొగడ్తలు చేసేవారితో నిండిపోయింది. నేను వారిని శిక్షిస్తాను అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.

Tags

Read MoreRead Less
Next Story