Bengaluru: కూతురు ఎదురుగా భార్యను చంపిన భర్త.. కారణమిదే!

కర్నాటకలో దారుణం జరిగింది. 32 ఏళ్ల మహిళను ఆమె భర్త చంపేశాడు. 12 ఏళ్ల కూతురు ముందే పొడిచేశాడు. ఈ ఘటన స్థానిక బస్టాండులో జరిగింది. బాధితురాలను రేఖగా, నిందితుడిని లోహితస్వగా గుర్తించారు. ఆ ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు. మూడు నెలల క్రితమే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. దీనికి పూర్వమే రేఖ గతంలో పెళ్లి చేసుకున్నది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భర్త నుంచి ఆమె వేరుగా ఉంటోంది. లోహితస్వ కూడా విడాకులు తీసుకున్న వ్యక్తే. అయితే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కిరాయి తీసుకుని కలిసి ఉంటున్నారు. రేఖ పెద్ద కూతురు ఆమెతోనే ఉంటోంది. చిన్న కూతురు మాత్రం రేఖ పేరెంట్స్ వద్ద ఉంటోంది.
రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రేఖ, లోహితస్వ.. కర్నాటకలోని సిర పట్టణం నుంచి బెంగుళూరుకు మకాం మార్చారు. తాను జాబ్ చేస్తున్న కాల్ సెంటర్‌లోనే రేఖ తన భర్తకు డ్రైవర్ ఉద్యోగం ఇప్పించింది. కానీ కొన్నాళ్ల నుంచి రేఖపై భర్తకు అనుమానాలు పెరిగాయి. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంన్నందుకు ఆగ్రహించాడు. అయితే లోహితస్వ అకస్మాత్తుగా అటాక్ చేశాడు. బస్ స్టాప్ వద్ద కూతురితో కలిసి వేయిటింగ్ చేస్తున్న రేఖపై కత్తితో దాడి చేశాడు. డజన్ల సార్లు పొడిచేశాడు. ఆ తర్వాత ఆ స్పాట్ నుంచి పరారీ అయ్యాడతను.
స్థానికలు ఆమెను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లినా, గాయాల వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయింది. కామాక్షీపాల్యా పోలీసు స్టేషన్‌లో మర్డర్ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com