13 ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించింది.. రూ.17 లక్షల జీతాన్ని వదులుకుంది.. ఎందుకు

అసలే ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతుంటే వచ్చిన ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నట్టు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఉద్యోగ ఆఫర్లు.. ఏంటా ధైర్యం.. ఎందుకు తన మీద తనకు అంత నమ్మకం. తెలిసిన వాళ్లు, బంధువులు, ఇంట్లో వాళ్లు ఒకటే చీవాట్లు.. అయినా అవేవీ పట్టించుకోదల్చుకోలేదు.
వచ్చిన ఉద్యోగాలన్నీ వదులుకుని బదులుగా ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రితీ కుమారి 21 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, ఆమె TCS, Infosys మరియు Wiproతో సహా 13 కంపెనీల నుండి ఉద్యోగ ఆఫర్‌లను అందుకుంది. వాటిలో ఒక కంపెనీ ఆమెకు సంవత్సరానికి 17 లక్షల రూపాయల జీతం ఆఫర్ చేసింది. అయినా రితీ తన మనసు మాటే వినాలనుకుంది. వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌షిప్ తీసుకుంది. ఇది ఒక సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ. దాంతో ఇప్పుడు ఆమెకు ఇంకా మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు రితి సంవత్సరానికి 20 లక్షలకు పైగా సంపాదిస్తుంది.
లింక్‌డిన్ లో తన ప్రొఫైల్ పోస్ట్ చేసింది. జనవరి 2022 నుండి జూలై 2022 వరకు వాల్‌మార్ట్‌లో శిక్షణ పొందింది. ఆపై ఆమె వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియా (బెంగళూరు)లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ -2గా చేరింది.
రితీ మాట్లాడుతూ, ఇంతకు ముందు వచ్చిన ఆఫర్‌లు అన్నీ బాగానే ఉన్నప్పటికీ, తన సోదరి చెప్పినట్లు వినాలనుకుంది. నీ లక్ష్యం ఒక్కటే అయినప్పుడు దానిమీదే ఫోకస్ పెట్టాలి. వచ్చే అంతవరకు ప్రయత్నించాలి అని అక్క చెప్పిన మాటల్ని శిరసావహించింది. అందుకే ఆమె చివరికి వాల్‌మార్ట్‌ని ఎంచుకుంది. ఇంటర్న్‌షిప్ వ్యవధి ఆరు నెలలు. ఆ సమయంలో ఆమెకు రూ.85,000 స్టైఫండ్ ఇస్తానని హామీ ఇచ్చింది కంపెనీ.
వాల్‌మార్ట్ ఇంటర్న్‌షిప్ ఆఫర్‌ను స్వీకరించినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, నేను దానిలో చేరాలని గట్టిగా అనుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు నా నిర్ణయాన్ని అంగీకరించలేదు. వాళ్లు నా నిర్ణయం పట్ల సంతోషంగా లేరు. "కానీ ఆ సమయంలో నా సోదరి నా హృదయాన్ని అనుసరించమని సలహా ఇచ్చింది."
ప్రస్తుతం ధన్‌బాద్‌లోని ఐఐటీలో పీహెచ్‌డీ చదువుతున్న ఆమె సోదరి ప్రీతి కుమారి, ఆమె కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో పాల్గొనేందుకు వచ్చిన ఉద్యోగ ప్రతిపాదనలను తిరస్కరించారు.
"ఆ సమయంలో ఆమెను కూడా అందరూ తప్పుపట్టారు. కానీ ఆమె నిర్ణయం తీసుకుంది. తాను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని అందరికీ తెలియజేసింది. అంతకంటే మంచి ఉద్యోగం సంపాదించింది. అందుకే నేను కూడా వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌షిప్ ఆఫర్‌ని తీసుకున్నాను. చాలా కష్టపడి పనిచేశాను. నా ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలను ఇచ్చాను. చివరికి వాల్‌మార్ట్ నుండి జాబ్ ఆఫర్ అందుకున్నాను అని రితి చెప్పారు.
తన కెరీర్ ఎంపికలపై తన తల్లిదండ్రుల స్పందన గురించి అడిగినప్పుడు.. "ప్రస్తుతం వారు నా విజయంతో చాలా సంతోషంగా ఉన్నారు. నాతో పాటు చదువుకున్న వారిలో అత్యున్నత స్థానం పొందిన విద్యార్థులలో ఒకరిగా ఉండటం వారికి గర్వకారణం. మా నాన్న స్కూల్ ఉపాధ్యాయుడు. నేను అదే పాఠశాలలో చదువుకున్నాను. తోటి ఉపాధ్యాయులందరూ నన్ను ప్రశంసిస్తూ, నాన్నని అభినందిస్తూ ఉండటంతో ఆయన చాలా గర్వపడుతున్నారు. ఓ కూతురిగా నాన్నకి ఇచ్చే బహుమతి ఇంతకంటే విలువైనది ఇంకేం ఉంటుంది అని రితి కించిత్ గర్వంతో చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com