Bengaluru: మొబైల్‌ ఫోన్‌ కోసం తమ్ముడిని హతమార్చిన అన్న

Bengaluru: మొబైల్‌ ఫోన్‌ కోసం తమ్ముడిని హతమార్చిన అన్న
బాలుడి అరెస్ట్ , జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు

ఫోన్‌ కోసం తమ్ముడిని హత్య చేశాడో అన్న. 18 ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్‌లో వీడియో గేమ్‌లు ఆడుతుండగా గొడవపడి తమ్ముడిని హత్య చేశాడు. పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మృతుడు, నిందితుడు బెంగళూరులోని నెరిగ ప్రాంతంలో నివసిస్తున్న ప్రనీష్, శివకుమార్‌లుగా గుర్తించారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో ఇంట్లో మొబైల్‌లో ప్రనీష్‌ ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన అన్న శివకుమార్ ఫోన్‌ను తనకు తిరిగి ఇవ్వాలని తమ్ముడిని కోరాడు. మొబైల్ ఫోన్‌లో వీడియో గేమ్‌లు ఆడుతున్న ప్రణీష్ దానిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అన్న శివకుమార్ సుత్తి పట్టుకుని ప్రణీష్‌ను బెదిరించి మొబైల్‌ ఇవ్వాలని కోరాడు. అయినా.. ప్రణీష్ తిరిగి ఇవ్వకపోవడంతో శివకుమార్ సుత్తితో తమ్ముడి తలపై పదేపదే కొట్టాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన తమ్ముడు ప్రనీష్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన జరిగినప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో లేరు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో తొలుత శివకుమార్‌ తన తమ్ముడిని తానే హత్య చేసినట్లు వెల్లడించలేదు. ఆ తర్వాత తమదైన శైలిలోవిచారించగా శివకుమార్ నేరం అంగీకరించాడు. ఈ సంఘటన మే 15 న జరిగిందని, నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు మీడియాకు తెలిపారు.

Tags

Next Story