Bengaluru: బెడ్‌రూమ్ కిటికీ తెరిచి ఉంచుతున్నారంటూ.. పొరుగింటి జంటపై మహిళ ఫిర్యాదు

పక్కింట్లో ఉండే ఓ జంట వాళ్ల బెడ్‌రూమ్ కిటికీ తెరిచి ఉంచుతోందని, దాని వల్ల తమ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోందంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లో చోటు చేసుకుంది.
బెంగళూరు సిటీలోని అవలహళ్లి బీడీఏ లే ఔట్‌లో అద్దెకు ఉంటున్న ఓ మహిళ తన పొరుగింటి వారిపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. వారు బెడ్‌రూమ్ కిటికీని తెరిచి ఉంచుతున్నారని, దాంతో వారి వ్యక్తిగత సంభాషణలు, సన్నిహిత శబ్దాలు తమ ఇంట్లోకి వినిపిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. వారి చేష్టలతో తమ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోందని వ్యాఖ్యానించింది. ఉద్దేశపూర్వకంగానే వారు కిటికీని తెరిచి ఉంచుతున్నారని ఫిర్యాదులో ఆరోపించింది.
కిటికీ తలుపు మూయమని ఎంత చెప్పినా వారు వినిపించుకోవట్లేదని తెలిపింది. ఈ విషయంలో ఇంటి ఓనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పింది. ఇంటి యజమాని కూడా వారికే వత్తాసు పలుకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం, రెచ్చగొట్టడం) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com