LK advani: బీజేపీ అగ్రనేతకు కేంద్రం అత్యున్నత గౌరవం

భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న.. దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత 96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీని వరించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్‌కే అద్వానీ భారతరత్నకు ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న వరించడం పట్ల తాను అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.
పార్లమెంట్‌లో ఆయన చేసిన ప్రసంగాలు ఎప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయి’ అని మోదీ ప్రశంసించారు. 96 ఏండ్ల అద్వానీ వాజ్‌పేయి మంత్రివర్గంలో ఉప ప్రధానిగా పనిచేశారు. అదే సమయంలో పలు కేంద్ర శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1970 నుంచి 2019 వరకు ఉభయ సభల్లో సభ్యుడిగా పనిచేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆయన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రథయాత్ర చేశారు. ఈ యాత్ర హిందువులలో రామ మందిర నిర్మాణేచ్ఛ రగిల్చిందని చెప్తారు. ఈ యాత్ర వల్లే దేశంలో బీజేపీ క్షేత్ర స్థాయి నుంచి బలపడింది. బీజేపీని రెండు సీట్ల నుంచి ప్రధాని పీఠం వరకు నడిపించింది.
అద్వానీకి భారతరత్న ప్రకటించడం పట్ల పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, ఎన్సీపీ అధ్యక్షుడు పవార్ హర్షం వ్యక్తం చేశారు. భారత దేశ అభివృద్ధికి అద్వానీ అవిరళ కృషి చేశారని పవార్ ప్రశంసించారు. మరోవైపు తన తండ్రి దేశానికి చేసిన సేవలకు భారతరత్న ప్రకటించడం పట్ల అద్వానీ కుమారుడు జయం త్ అద్వానీ హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను, మా కుటుంబ సభ్యులు దీనికి చాలా ఆనందపడుతున్నాం. దీనికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.’ అంటూ ఆయన పేర్కొన్నారు.
దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో లాల్ కృష్ణ అద్వానీ.. దేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు. అదే సమయంలో పలు కేంద్ర శాఖలకు కూడా మంత్రిగా పని చేశారు. 1970 నుంచి 2019 మధ్య ఎల్‌కే అద్వానీ.. పార్లమెంటు ఉభయసభల్లో సభ్యుడిగా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టి యావత్ దేశాన్ని ఏకం చేసిన వ్యక్తిగా ఎల్‌కే అద్వానీ చరిత్రలో నిలిచారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు. ఈ రథయాత్ర హిందువులను అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేలా చేసింది. దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి.. 2014 లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ నేతలైన అటల్ బిహారీ వాజ్‌పేయ్, మురళీ మనోహర్ జోషిలతో కలిసి శక్తివంచన లేకుండా కృషి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com