Army officer: పాక్ మొత్తంపై దాడి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉంది : ఎయిర్ డిఫెన్స్ డీజీ

పాకిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా పేర్కొన్నారు. పాక్‌లోని ప్రతి ప్రదేశం మీద భారత్ రేంజ్‌లోనే ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ పాకిస్తాన్ సైన్యం తమ ప్రధాన కార్యాలయాన్ని రావిల్పిండి నుంచి మారుమూల ప్రాంతానికి తరలించినా.. అక్కడ కూడా వారు కలుగు వెతుక్కొని మరి అందులో దాక్కోవాల్సిందేంటూ ఎద్దేవా చేశారు.
ఇక, పాకిస్తాన్ మొత్తాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం దగ్గర తగినన్నీ ఆయుధాలు ఉన్నాయని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ తెలిపారు. ఇటీవల పాక్ చేసిన దాడిని ఇండియన్ ఆర్మీ, నేవీ, వైమానిక దళం సమన్వయంతో సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. పాక్ లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. పాకిస్తాన్ భారత్ లోని పౌరుల ఇళ్లపై దాడులకు ప్లాన్ చేసినప్పటికీ ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పికొట్టిందన్నారు. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సదరు ఆర్మీ అధికారి వెల్లడించారు.
ఇక ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో దేశీయ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్లు, గైడెడ్ మ్యూనిషన్లు కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజలను కాపాడటమే సాయుధ బలగాల ప్రాథమిక కర్తవ్యమని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. దానికి అనుగుణంగానే ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com