Lalu Yadav: ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు అభియోగాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌పై సోమవారం ఢిల్లీ కోర్టు అభియోగాలు మోపింది.
లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్లనిర్వహణ కాంట్రాక్టులు కేటాయించడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి . రాంచీ, పూరీల్లోని రెండు హోటళ్ల కాంట్రాక్టులను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇదంతా లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో జరిగిందని పేర్కొంది.
ఈ మేరకు 2017లో లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ.. తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఆరోపణలతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుఏకీభవించింది. ఈ మేరకు లాలూ, ఆయన భార్య, కుమారుడిపై ఢిల్లీ కోర్టు తాజాగా అభియోగాలు మోపింది. దీంతో ఈ కుంభకోణం కేసులో వీరు విచారణను ఎదుర్కోనున్నారు. అయితే, యాదవ్ కుటుంబం ఈ ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తోంది. తమపై ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసును బనాయించారని వాదిస్తోంది. ప్రస్తుతం ఈ పరిణామం ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారనున్నట్లు కనిపిస్తోంది. లాలూ ఫ్యామిలీపై అవినీతి అస్త్రంగా ప్రత్యర్థి పార్టీలు ప్రయోగించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రత్యర్థులు.. ఆర్జేడీని అస్త్రంగా ఉపయోగించుకోవచ్చు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 14న జరగనుంది. ఓ వైపు ఎన్డీఏ-ఇండియా కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తుండగా.. ఇంకోవైపు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అరంగ్రేటంతో పోరాడుతున్నారు. అయితే ఈసారి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com