Bihar CM Nitish : ఓబీసీ రిజర్వేషన్ పెంపుకు బిహార్ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్

Bihar CM Nitish :  ఓబీసీ రిజర్వేషన్  పెంపుకు బిహార్ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్
X
బీసీలకు 43%, ఎస్సీలకు 20%

అత్యంత వెనుకబడిన వర్గాలకు (మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్) 65 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన ప్రతిపాదనకు బిహార్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ప్రతిపాదనను మంగళవారం అసెంబ్లీ ముందు ఉంచారు. అనంతరం జరిగిన ఓటింగులో దీనికి పూర్తి స్థాయి మద్దతు లభించింది.

దేశంలో కుల గణనను చేపట్టిన తొలిరాష్ట్రంగా.. అనేక విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిన బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ మరింత దూకుడు పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచే ప్రక్రియను శరవేగంగా అమలు చేసేందుకు నడుం బిగించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్‌తో ఆమోద ముద్ర వేయించుకున్న ముఖ్యమంత్రి.. బిల్లును గురువారమే సభలో ప్రవేశ పెట్టాలని, సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. రాష్ట్రంలో చేపట్టిన కుల గణన సర్వే పూర్తిస్థాయి నివేదికను ఆయన మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ), అత్యంత వెనుకబడిన తరగతులు(ఈబీసీ) సహా 215 కులాలకు సంబంధించిన జీవన, ఆర్థిక స్థితిగతులను ఈ నివేదికలో వివరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో 50 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. ఇక, దీనికి కేంద్రం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ 10ు అదనంగా ఉంటుంది. దీంతో నితీశ్‌ ప్రతిపాదనను అమలు చేస్తే రాష్ట్రంలో రిజర్వేషన్లు 75 శాతానికి చేరనున్నాయి.

Tags

Next Story