జాతీయ

బీహార్ ఎన్నికలు : ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం..

టైమ్స్ నౌ- సిఓటర్ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం బీహార్ లో ఎన్నికల పోటీ ఆసక్తికరంగా ఉంది. వివిధ అంశాల ఆధారంగా చేపట్టిన సర్వేలో షాకింగ్ సంఖ్యలు నమోదు అయ్యాయి..

బీహార్ ఎన్నికలు : ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం..
X

టైమ్స్ నౌ- సిఓటర్ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం బీహార్ లో ఎన్నికల పోటీ ఆసక్తికరంగా ఉంది. వివిధ అంశాల ఆధారంగా చేపట్టిన సర్వేలో షాకింగ్ సంఖ్యలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా దేశ ప్రధాని పనితీరు బీహార్ ప్రజలు 51.6 శాతం బాగుందని, 18.4 శాతం యావరేజ్ గా ఉందని, 30 శాతం మంది పూర్ గా ఉందని సర్వేలో తేలినట్టు వెల్లడించింది. ఇక రాష్ట్రంలో ఎటువంటి సమస్యలతో ఎన్నికలు జరుగుతాయి అనే అంశాన్ని పరిశీలిస్తే.. ప్రధానంగా 54.03 శాతం నిరుద్యోగం, అవినీతి 5.11 శాతంతో, కరోనా ఎఫెక్ట్ వలన 10.04 శాతం, 19.87 శాతం ఇతర సమస్యల ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సర్వే తేల్చింది.

బీహార్ కు తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందనే అంశాన్ని తీసుకుంటే.. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ పై 29.5 శాతం ఓటర్లు అనుకూలంగా ఉన్నారు.. అలాగే కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు, ఎల్జేపీ అధినేత, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కు అనుకూలంగా 13.8 శాతం మంది ఉన్నారు. అలాగే ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ కు అనుకూలంగా 19.9 శాతం మంది ఉన్నారు. బీజేపీ నేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సీఎం కావాలని 9.6 శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నారని తేలిందని సదరు సర్వే సంస్థ పేర్కొంది. ఇక చివరగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పనితీరుపట్ల 27.43 శాతం ఓటర్లు చాలా సంతృప్తితో ఉంటే.. 31.54 శాతం మంది కొంతవరకు సంతృప్తితో ఉన్నారు. ఇక 40.42 శాతం మంది ముఖ్యమంత్రి పనితీరు సంతృప్తి కరంగా లేదని ఓటర్లు అభిప్రాయపడుతున్నట్టు టైమ్స్ నౌ- సిఓటర్ సర్వే సంస్థ పేర్కొంది.

Next Story

RELATED STORIES