బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా

బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్ ఫాగు చౌహాన్‌కు సమర్పించారు..

బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్ ఫాగు చౌహాన్‌కు సమర్పించారు. అధికారికంగా నితీష్‌ను తమ నేతగా ఎన్డీయే రేపు ప్రకటించనుంది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 29వ తేదీతో ముగియనుంది. ఈనెల 15న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సంయుక్త సమావేశం జరిపి, ముఖ్యమంత్రి పదవిపై ఏకాభిప్రాయం కుదరగానే ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు గవర్నర్‌ను కలిసి తెలియజేస్తారు. దీనిపై ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన జేడీయూ, బీజేపీ, హెచ్ఎం, వికాశీల్ ఇన్సాన్ పార్టీలు సమావేశమయ్యాయి. రేపు జరిగే సంయుక్త సమావేశంలో ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ నేతగా నితీష్‌ను ఎన్నుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఈ లాంఛనాలన్నీ పూర్తికావాల్సి ఉంటుంది..

అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీ 31 సీట్ల ఆధిక్యం సాధించి, మొత్తం 74 సీట్లు గెలుచుకుంది. అయినప్పటికీ నితీష్ కుమార్‌కే పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం స్థిరనిశ్చయంతో ఉంది. నితీష్‌ను ఎన్నికల ముందే ఎన్డీయే సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది..ఇక ఉప ముఖ్యమంత్రిగా ఈబీసీ నేతను కానీ, దళిత నేతను కానీ బీజేపీ ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి. ఇందుకోసం సుశీల్ కుమార్ మోదీని మారుస్తారా, మరో డిప్యూటీ సీఎం పదవిని ఏర్పాటు చేస్తారా అనేది స్పష్టం కాలేదు.

Tags

Read MoreRead Less
Next Story