Bihar : ఆపరేషన్ టైగర్.. తొమ్మిది మందిని చంపిన పులి..

X
By - Sai Gnan |8 Oct 2022 8:30 PM IST
Bihar : బిహార్ వెస్ట్ చంపారన్ జిల్లాలో మనుషులను చంపుతున్న పులిని ఫారెస్టు అధికారులు చంపేశారు
Bihar : బిహార్ వెస్ట్ చంపారన్ జిల్లాలో మనుషులను చంపుతున్న పులిని ఫారెస్టు అధికారులు చంపేశారు. గడిచిన మూడు రోజుల వ్యవధిలో నలుగురిని చంపిందన్నారు ఫారెస్టు అధికారులు. ఇప్పటివరకూ గత 25 రోజుల్లో మొత్తం 9 మంది పులి చేతిలో హతమయ్యారని చెప్పారు. గత ఆరు రోజులుగా పులి కోసం గాలిస్తున్న ఫారెస్టు అధికారులు ఎట్టకేలకు ఇవాళ దానిని మట్టుబెట్టారు.
చనిపోయిన పులి వయసు మూడు సంవత్సరాల 5 నెలలని చెప్పారు అధికారులు. సెప్టెంబర్ 12 నుంచి మనుషులపై దాడి చేస్తోందని చెప్పారు. శుక్రవారం రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దామ్‌రో గోవర్ధన్ అనే గ్రామంలో సంజయ్ అనే వ్యక్తిని పులి చంపింది. దీంతో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com