Bihar: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం.. తేజస్వీ యాదవ్ ఎన్నికల హామీ..

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 20 రోజుల్లోపు ఈ ఉపాధి హామీని నిర్ధారించడానికి కొత్త చట్టం తీసుకురాబడుతుందని యాదవ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఎన్నికలప్పుడే నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తారు.. వాళ్ల అవసరాలు, వాళ్ల బాధలు తాము అధికారంలోకి వస్తే తీరుస్తామని అమలు కానీ వాగ్ధానాలను అవసరం తీరేందుకు చేస్తుంటారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత అధికారాన్ని నిలుపుకునే ప్రయత్నంలో అడ్డదారులు ఎన్నో తొక్కుతుంటారు. ఇచ్చిన వాగ్ధానాలు గాలికి వదిలేస్తారు. ప్రజల కనీస అవసరాలను కూడా పట్టించుకోరు. ఇవన్నీ జనాలకు తెలియంది కాదు..
ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. గురువారం ఎన్నికలకు ముందు ఒక సాహసోపేతమైన వాగ్దానం చేశారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే బీహార్‌లోని ప్రతి ఇంట్లో కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 20 రోజుల్లోపు ఈ ఉపాధి హామీని నిర్ధారించడానికి కొత్త చట్టం తీసుకురాబడుతుందని యాదవ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. బాధ్యతలు చేపట్టిన 20 నెలల్లోపు ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా అమలు చేస్తామని యాదవ్ తెలిపారు.
"మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండేలా చూస్తాము. 20 నెలల్లో ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండదు" అని యాదవ్ తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడింది. 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com