Bihar : భార్యకి పెళ్లి చేసిన భర్త

Bihar : భార్యకి పెళ్లి చేసిన భర్త
వివాహేతర విషయం తెలిసి భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త

లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భార్యను అతడికే ఇచ్చి పెళ్లిచేశాడు ఓ భర్త. అచ్చు సినిమాల్లో జరిగే సంఘటన లాంటి ఈ ఘటన బీహార్‌లోని నవాడా జిల్లాలో వెలుగు చూసింది.

ఇప్పటివరకు భార్యపై తన ఆధిపత్యాన్ని చేలాయించే మొగుళ్లను చూసాం. అయిన దానికి, కాని దానికి కొట్టి బాధపెట్టే భర్తలని చూశాం. ఏ తప్పు చేయకపోయినా సరే, ఆమె మనసునో, శరీరాన్నో హింసించే వాళ్ళనీ చూసాం. అలా అని భర్తల అందరూ ఒకేలా ఉంటారని, చెడ్డవాళ్ళని కాదు..ఒక్కొక్కరు ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తిస్తారు.. కానీ ఇక్కడ కధే వేరు. ఆమె తప్పు చేసింది. చేస్తున్నది తప్పని, భర్తే కాదు సమాజంలో ఎవరూ అంగీకరించరు అన్న విషయం కూడా తెలిసే తెలిసే తప్పుడు మార్గంలో ప్రయాణించి అడ్డంగా దొరికిపోయింది.

వివరాల్లోకి వెళితే..

నవాడా జిల్లాలో నివసించే దంపతులకి మూడేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే భార్య పక్క గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. విషయం భర్తకు తెలిసింది. పొరపాటు జరిగిపోయింది.. నిన్ను నువ్వు మార్చుకో అని బుద్ధి చెప్పాడు. హెచ్చరించాడు. ఆమె మారలేదు.. ప్రియుడిని కలవడం మానుకోలేదు. అప్పటికే ప్రియుడికి కూడా పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రియుడు ఎప్పటిలాగే భర్త లేని సమయం చూసి ఆమెను కలిసేందుకు ఇంటికి వెళ్లాడు. వాళిద్దరూ ఏకాంతంగా ఉండగా భర్త కుటుంబ సభ్యులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కుటుంబ సభ్యులు ప్రియుడిని చితక్కొట్టి బంధించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను, అతడిని గ్రామం విడిచి వెళ్లాలని ఆదేశించారు.

అప్పుడే ఇంటికి వచ్చాడు భర్త. విషయం తెలుసుకున్నాడు.. తెల్లవారాక ఇద్దరినీ తీసుకొని గ్రామస్థులందరి సమక్షంలో శివాలయంలో వారి వివాహం చేయించాడు. ఆనందమో, బాధో తెలియదు కానీ ప్రియుడు వివాహిత నుదుటిపై కుంకుమ పెట్టే సమయంలో ఆమె వలవలా ఏడుస్తూనే ఉంది. ఈ ఘటన గురించి తమకు తెలిసిందని చెబుతున్న స్థానిక పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story