BIHAR: బిహార్‌‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

BIHAR: బిహార్‌‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
X
రాజకీయ వేదికలకు సిద్ధమైన బిహార్

బి­హా­ర్ రా­జ­కీ­యా­ల్లో చా­రి­త్రక మా­ర్పు­ల­కు వే­దిక సి­ద్ధ­మైం­ది. సు­దీ­ర్ఘ­కా­లం ము­ఖ్య­మం­త్రి­గా పాలన సా­గిం­చిన నీ­తీ­శ్‌­కు­మా­ర్‌ త్వ­ర­లో రా­జ్య­స­భ­కు వె­ళ్ల­నుం­డ­టం­తో, ఆ రా­ష్ట్రం­లో తొ­లి­సా­రి­గా సొం­తం­గా ప్ర­భు­త్వం ఏర్పా­టు చే­సేం­దు­కు బీ­జే­పీ పా­వు­లు కదు­పు­తోం­ది. ఈ పరి­ణా­మం­తో కమలం పా­ర్టీ నుం­చి తదు­ప­రి ము­ఖ్య­మం­త్రి పగ్గా­లు ఎవరు చే­ప­డ­తా­ర­నే అం­శం­పై జా­తీయ స్థా­యి­లో ఉత్కంఠ నె­ల­కొం­ది. సా­మా­జిక సమీ­క­ర­ణా­ల­ను బే­రీ­జు వే­స్తూ, బడు­గు బల­హీన వర్గా­ల­కు ప్రా­ధా­న్యత ఇచ్చే­లా అధి­ష్టా­నం అడు­గు­లు వే­స్తోం­ది.

ము­ఖ్య­మం­త్రి రే­సు­లో ప్ర­స్తు­తం ఉప­ము­ఖ్య­మం­త్రి సా­మ్రా­ట్‌ చౌ­ధ­రీ పేరు బలం­గా వి­ని­పి­స్తోం­ది. ఓబీ­సీ సా­మా­జిక వర్గా­ని­కి చెం­దిన ఆయ­న­ను పె­ద్ద నా­య­కు­డి­ని చే­స్తా­మ­ని గతం­లో అమి­త్‌ షా స్వ­యం­గా ప్ర­క­టిం­చ­డం వి­శే­షం. అయి­తే ఆయన ఆర్జే­డీ నుం­చి వచ్చి పదే­ళ్లు కూడా పూ­ర్తి కా­క­పో­వ­డం కొంత చర్చ­కు దా­రి­తీ­స్తోం­ది. మరో­వై­పు కేం­ద్ర హోం­శాఖ సహాయ మం­త్రి ని­త్యా­నం­ద్‌ రా­య్‌ పేరు కూడా పరి­శీ­ల­న­లో ఉంది. ఆర్ఎ­స్ఎ­స్, ఏబీ­వీ­పీ నే­ప­థ్యం ఉన్న ఆయన, రా­ష్ట్రం­లో అత్య­ధిక జనా­భా కలి­గిన యాదవ సా­మా­జిక వర్గా­ని­కి చెం­ది­న­వా­రు. కా­క­పో­తే ఆయ­న­కు అవ­కా­శం ఇస్తే ఇతర వె­ను­క­బ­డిన వర్గాల నుం­చి వ్య­తి­రే­కత రా­వ­చ్చ­నే సం­దే­హా­లు పా­ర్టీ వర్గా­ల్లో ఉన్నా­యి.

వీ­రి­తో పాటు అగ్ర­వ­ర్ణా­ల­కు చెం­దిన మం­గ­ళ్ పాం­డే, అత్యంత వె­ను­క­బ­డిన వర్గాల ప్ర­తి­ని­ధి­గా సం­జీ­వ్ చౌ­రా­సి­యా పే­ర్లు కూడా జా­బి­తా­లో ఉన్నా­యి. వె­స్ట్‌ చం­పా­ర­న్‌ ఎంపీ సం­జ­య్‌ జై­స్వా­ల్‌, ఉప ము­ఖ్య­మం­త్రి వి­జ­య్‌ సి­న్హా సైతం ఈ పదవి కోసం పో­టీ­లో ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. బీ­జే­పీ అధి­నా­య­క­త్వం ఎవరి వైపు మొ­గ్గు చూ­పు­తుం­ద­నే­ది ఇప్పు­డు ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. ఒక­వై­పు సా­మా­జిక వ్యూ­హం, మరో­వై­పు పా­ర్టీ పట్ల వి­ధే­య­త­ను పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కు­ని తుది ని­ర్ణ­యం తీ­సు­కు­నే అవ­కా­శం ఉంది.అం­తే­కా­కుం­డా ఈ కొ­త్త రా­జ­కీయ సమీ­క­ర­ణా­ల్లో భా­గం­గా నీ­తీ­శ్‌ కు­మా­రు­డు ని­శాం­త్‌ కు­మా­ర్‌­కు ఉప­ము­ఖ్య­మం­త్రి పదవి దక్క­వ­చ్చ­నే ప్ర­చా­రం కూడా జో­రం­దు­కుం­ది. ఒక­వేళ ఇదే జరి­గి­తే బి­హా­ర్ రా­జ­కీ­యా­ల్లో ఇదొక కొ­త్త మలు­పు అవు­తుం­ది. అటు నీ­తీ­ష్ వర్గా­న్ని సం­తృ­ప్తి పరు­స్తూ­నే, ఇటు రా­ష్ట్రం­లో బీ­జే­పీ తన పట్టు­ను బల­ప­రు­చు­కు­నే­లా ప్ర­ణా­ళి­క­లు రచి­స్తోం­ది. బి­హా­ర్‌­లో సా­మా­జిక సమీ­క­ర­ణా­ల­ను సమ­తూ­కం చే­స్తూ­నే, రా­బో­యే ఎన్ని­క­ల­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని బీ­జే­పీ ఈ కీలక ని­ర్ణ­యం తీ­సు­కో­నుం­ది. ఈ మా­ర్పు­తో రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల్లో దశా­బ్దాల కా­లం­గా కొ­న­సా­గు­తు­న్న నీ­తీ­ష్ శకం ము­గి­సి, కమ­ల­ద­ళం నే­తృ­త్వం­లో కొ­త్త అధ్యా­యం మొ­ద­లు­కా­నుం­ది.

Tags

Next Story