Madhya Pradesh: గడ్డియంత్రంతో పాము కత్తిరింపు.. తలభాగం కాటేసి యువతి మృతి

మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు పెరిగిన గడ్డిని కత్తిరిస్తుండగా పాము మూడు ముక్కలైంది.. కొన ఊపిరితో ఉన్న ఆ పాము కాటేయడంతో గడ్డి కత్తిరిస్తున్న యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మురైనా జిల్లా సబల్ గఢ్ సమీపంలోని గ్రామంలో భర్తి కుశ్వాహా అనే యువతి ఆదివారం ఉదయం తన ఇంటి ముందున్న గడ్డిని తొలగిస్తోంది. దట్టంగా పెరిగిన గడ్డిని గ్రాస్ కట్టర్ సాయంతో కట్ చేస్తోంది.
కత్తిరిస్తుండగా గడ్డిలో దాగి ఉన్న పామును ఆమె గమనించలేదు. గ్రాస్ కట్టర్ కారణంగా పాము మూడు ముక్కలైంది. తల భాగం కుశ్వాహా సమీపంలో పడింది. కొన ఊపిరితో ఉన్న ఆ పాము కుశ్వాహాను కాటేసింది. కుటుంబ సభ్యులు గమనించి కుశ్వాహాను తొలుత నాటు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో కుశ్వాహాను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

