BJP: ఒడిస్సా లో గెలుపు దిశగా బీజేపీ

దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ హోరాహోరీగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఒరిస్సాలో ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతాదళ్ జైత్రయాత్రకు బిజెపి బ్రేక్ వేసే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 24 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ పార్టీ 50 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగగా.. బిజెపి 73 స్థానాలు ఆదిత్యంలో కొనసాగుతుంది.
ఒడిశాలో 2024 ఎన్నికల్లో ఫలితాలు మారబోతున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్లో నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతా దళ్ జైత్రయాత్రకు భారతీయ జనతా పార్టీ బ్రేకులు వేయనున్నట్లు ఫలితాల ట్రెండ్ సూచిస్తోంది. 2000 సంవత్సరం నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈసారి పదవికి దూరం కానున్నారని ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అధికారం బిజెపి 73 చోట్ల లీడ్ లో కొనసాగుతుండగా.. బీజేడీ అభ్యర్థులు కేవలం 50 చోట్ల ముందంజలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ వివరాల ప్రకారం.. మరో 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది.
నిజానికి ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 74.. ఈ నేపథ్యంలో బీజేపీ 73 చోట్ల లీడ్ లో కొనసాగుతుండడంతో ఒడిశాలో ఈసారి అధికార మార్పిడి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఒడిస్సాలో పోలింగ్ శాతం సైతం భారీగా పెరిగింది. ఎన్నికల్లో 74.4% ఓటింగ్ జరగక గత ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదయింది కాక గత ఎన్నికల్లో బీజు జనతాదళ్ 113 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com