BJP Candidate List: బీజేపీ తొలి జాబితా విడుదల

BJP Candidate List: బీజేపీ తొలి జాబితా విడుదల
మూడు రాష్ట్రాల అభ్యర్థుల జాబితాలు విడుద‌ల

ఐదు రాష్ట్రాల ఎన్నికల షె‌డ్యూల్ వెలువడిన వేళ భాజపా మూడు రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన జాబితాలు వెలువరించింది. మధ్యప్రదేశ్‌లో..57మందితో మరో జాబితా విడుదల చేసిన భాజపా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మరోసారి బుద్నీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే 79 మంది పేర్లు ప్రకటించిన భాజపా..ఈ 57తో కలిపితే 136 స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లు అయ్యింది. రాజస్థాన్‌లో41 మందితో తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. వీరిలోఏడుగురు సిట్టింగ్‌ ఎంపీలు కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల కోసం... మరో 64 మంది పేర్లు విడుదల చేసింది. ఇప్పటికే 21 మంది పేర్లు ప్రకటించగా మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. తాజా జాబితాలో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ రాజ్‌నంద్‌గావ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇద్దరు ఎంపీలు రేణుకా సింగ్‌, గోమటి సాయిని కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దించింది.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఎంపీ రేణుకా సింగ్‌ను భరత్‌పూర్-సోన్‌హట్ స్థానం నుంచి అభ్యర్థిగా ఎంపిక చేసింది. పాతల్‌గావ్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపీ గోమతి సాయి. లోర్మీ అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ అరుణ్ సావ్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అటు రాజస్థాన్ లోనూ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బిజెపి జాబితా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తొలి జాబితాలో మొత్తం 41 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఈ 41 మంది అభ్యర్థులలో 7 మంది ఎంపీలకు కూడా టిక్కెట్లు ఇచ్చారు. ఎన్నికల సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం రాజస్థాన్‌లో ఈసారి మొత్తం 5.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 2.73 కోట్ల మంది పురుష ఓటర్లు కాగా, 2.52 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదే సమయంలో తొలిసారిగా ఓటు వేయబోతున్న 22.04 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.ఇక తెలంగాణలోనూ రేపో మాపో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story