Madhya Pradesh : సీఎం ఎవరన్నది సస్పెన్స్‌, పరిశీలకునిగా డాక్టర్‌ లక్ష్మణ్‌

Madhya Pradesh : సీఎం ఎవరన్నది సస్పెన్స్‌,  పరిశీలకునిగా డాక్టర్‌ లక్ష్మణ్‌
శివరాజ్‌ ట్వీట్‌పై దుమారం

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. భాజపా అధిష్టానం ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తదుపరి సీఎం ఎవరనే దానిపై నిర్ణయం తీసుకొనున్నారు. సోమవారం ప్రత్యక కమిటీ.... పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ క్రమంలో "అందరికీ రామ్ రామ్‌" అంటూ శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ట్వీట్‌ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉండబోనని పరోక్షంగా చెప్పేందుకే ఆయన అలా ట్వీట్‌ చేశారని గుసగులు వినిపించాయి. మరో వైపు దీనిపై స్పందించిన శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌.... ఎవరినైనా పలకరించేటప్పుడు రామ్ రామ్‌ అని చెప్పడం సాధారణమైందని చెప్పుకొచ్చారు. అందుకే తాను ఆ విధంగా ట్వీట్‌ చేశానని చౌహన్‌ వెల్లడించారు.


మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తుంది. ఇంత వరకూ ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని నిర్ణయించలేదు. దీనిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాలన్న ఉద్దేశ్యంతో పార్టీ అగ్రనేతలున్నట్లు సమాచారం. అందుకోసం అన్ని రకాలుగా ఆలోచనలు చేస్తుంది. రేసులో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. అయితే దీనిపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. త్వరగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని తేల్చాలని నిర్ణయించింది. ఇందుకోసం పరిశీలకులను నియమించింది. మధ్యప్రదేశ్‌ సీఎం ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీలో హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌,ఆశా లక్డా పరిశీలకులుగా ఉన్నారు. తెలంగాణ నేత, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ను పరిశీలకుడిగా నియమించింది. పరిశీలకులు ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగా సీఎం అభ్యర్థులను ఖరారు చేస్తారు. ఈ కమిటీలు ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పరిశీలించి ఫైనల్‌ చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story