Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ పై బిజెపి ప్రత్యేక దృష్టి

Chhattisgarh :  ఛత్తీస్‌గఢ్‌ పై బిజెపి ప్రత్యేక దృష్టి
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతే ప్రచార అస్త్రంగా

ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అదే ఊపులో లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న కమలం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీకి ఉన్న చరిష్మానే ప్రధాన బలంగా భాజపా రంగంలోకి దిగగా ప్రభుత్వ వ్యతిరేకతను న్యాయ్‌ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లిలబ్ధి పొందాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది .

సార్వత్రిక ఎన్నికల సమరంలో ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 11 లోక్‌సభ స్థానాలకుమూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లోమూడు దశల్లో పోలింగ్‌ జరగనుండగా..ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లో భాజపా 9 స్థానాలు కైవసం చేసుకోగాకాంగ్రెస్‌ పార్టీ రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పోలింగ్‌ తేదీకి సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ-కాంగ్రెస్‌ప్రచార వ్యూహాలకు మరింత పదును పెట్టాయి. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో జరిగిన అభివృద్ధి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అయోధ్య రామాలయ ప్రారంభం ప్రధాని మోదీ చరిష్మాలే ప్రధాన అస్త్రాలుగా భాజపా ప్రచారంలో దూసుకుపోతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన అనేక హామీలను భాజపా సర్కార్‌ నెరవేర్చింది. దీనిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మరోవైపు వ్యవసాయ సంక్షోభం పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగం కుల గణన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల వద్దకు వెళ్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ భాజపాకు ప్రధాన బలంగా మారనుంది. అబ్‌కీ బార్‌ చార్‌ సౌ పార్‌ అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు శ్రేణులు క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 11 స్థానాలకు భాజపా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. నలుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లను నిరాకరించింది. ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గురు మహిళా నేతలకు కమలం పార్టీ టికెట్లు ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఇద్దరు మాజీ మంత్రులకు సీట్లు కేటాయించింది. ఏడాది క్రితం వరకూ ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాకర్షక పథకాలుఅభివృద్ధిపై భారీ నమ్మకం పెట్టుకున్నా 2023 శాసనసభ ఎన్నికల్లో.. పరాజయం పాలైంది. కానీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని హస్తం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది.


Tags

Read MoreRead Less
Next Story