Online Nikah: పాకిస్తాన్ యువ‌తిని పెళ్లాడిన బీజేపీ కార్పొరేట‌ర్ కుమారుడు

Online Nikah: పాకిస్తాన్ యువ‌తిని పెళ్లాడిన బీజేపీ కార్పొరేట‌ర్ కుమారుడు
X
లాహోర్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఉత్తరప్రదేశ్ యువకుడు

పాకిస్థాన్ అమ్మాయికి, భారతదేశ అబ్బాయికి అనివార్య పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో వివాహం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడి కుమారుడు అనూహ్యంగా ఈ విధంగా ప్రత్యేక రీతిలో ‘నికా’ చేసుకోవాల్సి వచ్చింది. బీజేపీ కార్పొరేటర్ అయిన తహసీన్ షాహిద్ పెద్ద కొడుకు మహ్మద్ అబ్బాస్ హైదర్‌ పాక్‌లోని లాహోర్‌కు చెందిన ఆండ్లీప్ జహ్రాను పెళ్లి చేసుకున్నాడు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదాల కారణంగా వరుడు షాహిద్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. దానికి తోడు వధువు తల్లి యాస్మిన్ జైదీ అనారోగ్యంతో ఐసీయులో చేరడం పెళ్లికి మరింత ఆటంకాలుగా మారాయి. దీంతో పెళ్లి వేడుకను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని షాహిద్ నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూతురు తరపువారు కూడా అంగీకారం తెలపడంతో ఆన్‌లైన్‌లోనే పెళ్లి తంతుని ముగించారు.

శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌లో నికా జరిగింది. ఇక్కడి నుంచి షాహిద్ కుటుంబ సభ్యులు, లాహోర్‌ నుంచి వధువు కుటుంబం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహంపై షియా మత పెద్ద మౌలానా మహఫూజుల్ హసన్ ఖాన్ స్పందించారు. ఇస్లాంలో నికాకు స్త్రీ అంగీకారం చాలా ముఖ్యమని, తన సమ్మతిని ఆమె మౌలానాకు తెలియజేస్తుందని చెప్పారు. ఇరువైపుల మౌలానాలు కలిసి వేడుకను నిర్వహించగలిగినప్పుడు ఆన్‌లైన్‌లో నికా సాధ్యమవుతుందని ఆయన వివరించారు.ఈ వివాహ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అయితే త‌న భార్య అండ్లీప్‌కు ఇండియ‌న్ వీసా ల‌భిస్తుంద‌ని అబ్బాస్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Tags

Next Story