MP CRY: పశ్చిమబెంగాల్‌లో మణిపూర్ తరహా ఘటన.. ఎంపీ కంటతడి
మణిపుర్‌లో మహిళను వివస్త్రను చేసిన నగ్నంగా ఊరేగించినparading naked) ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇదే తరహా అమానవీయ ఘటన( Manipur video case) పశ్చిమబెంగాల్(West Bengal)లో కూడా చోటు చేసుకుందని హుగ్లీ భాజపా (BJP MP) ఎంపీ లాకెట్ ఛటర్జీ(Locket Chatterjee) ఆరోపించారు. మణిపుర్ ఘటపై మాట్లాడుతూ మీడియా సమావేశంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. జులై 8న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ అమానవీయ ఘటన జరిగిందని ఆరోపించారు. భాజపా మహిళా అభ్యర్థిని వివస్త్రని చేసి ఆమె పట్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తలు అమానవీయంగా వ్యవహరించారని చెప్పారు. ఇదో మణిపుర్ తరహా ఘటన అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
మణిపూర్ ఘటనను ఖండిస్తున్నామని తెలిపిన పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు(West Bengal BJP chief) సుకాంత మజుందార్ పశ్చిమ బెంగాల్ కూడా ఈ దేశంలో భాగమేనని అన్నారు. బెంగాల్‌లో మహిళకు జరిగిన ఘటన కూడా అమానవీయమని అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కార్యకర్తలు దారుణంగా ప్రవర్తించారని చెప్పారు.
హౌరా జిల్లాలోని దక్షిణ్ పంచాలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపిన సుకాంత మజుందార్.. దీనిపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా టీఎంసీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కూడా ఈ దేశంలో భాగమేనని, ఆ రాష్ట్రంలో మహిళకు జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడాలని కోరారు. టీఎంసీ కార్యకర్తలు భాజపా మహిళా అభ్యర్థి పట్ల వ్యవహిరించిన తీరు అమానవీయం. రెండింటి మధ్య వ్యత్యాసం ఒక్కటే.. మణిపుర్ ఘటనలో వీడియో ఆధారం ఉంది. పశ్చిమ బెంగాల్ ఘటనలో వీడియో ఆధారం లేదని సుకాంత మజుందార్ విమర్శించారు.పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా హౌరా జిల్లాలోని దక్షిణ్ పంచాలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా టీఎంసీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com