BJP MP: పహల్గామ్‌లో మహిళలు బతిమిలాడకుండా పోరాడి ఉండాల్సింది.. వివాదంలో మరో బీజేపీ ఎంపీ

BJP MP: పహల్గామ్‌లో మహిళలు బతిమిలాడకుండా పోరాడి ఉండాల్సింది..  వివాదంలో మరో బీజేపీ ఎంపీ
X
మహిళలు ఎదురుతిరిగితే తక్కువ మంది చనిపోయే వారు..

పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పలువురు రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా పహల్గామ్ ఉగ్రదాడిపై చేసిన కామెంట్స్‌పై వివాదం చెలరేగింది. ఉగ్రవాద దాడి సమయంలో మహిళలు తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులుగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఉండాల్సిందని ఆయన అనడం రాజకీయ దుమారాన్ని రేపింది. ‘‘పహల్గామ్‌లో మహిళలు రాణి లక్ష్మీబాయి, అహల్యాబాయి హోల్కర్‌ల ధైర్యాన్ని ప్రదర్శించి ఉగ్రవాదుల్ని ఎదుర్కొని ఉంటే తక్కువ మంది చనిపోయి ఉండేవారు. ఉగ్రవాదులకు చేతులు జోడించినా వినరు’’ అని దేవి అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియా చీఫ్ సుప్రియా శ్రీనేట్, బీజేపీ ఎంపీ వ్యాఖ్యల్ని విమర్శించారు. ‘‘పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల గురించి బిజెపి ఎంపి రామచంద్ర జాంగ్రా మాట్లాడుతున్నారు. ఆమెకు యోధుడి స్ఫూర్తి లేదు, ఉత్సాహం లేదు, హృదయం లేదు. అందుకే వారు చేతులు ముడుచుకుని బుల్లెట్‌కు బాధితులయ్యారు’’ అని ఎక్స్‌లో విరుచుకుపడ్డారు. బీజేపీ సిందూరం గురించి మాట్లాడుతుందా..? సిగ్గులేనితానికి ఒక పరిమితి ఉంటుంది అని ఆమె కామెంట్ చేశారు. పహల్గామ్ ఉగ్రవాదుల్ని పట్టుకోలేకపోవడంపై జంగ్రా మాట్లాడుతూ..‘‘దాడి చేసిన వారిని పట్టుకోకపోయినా, మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను, సూత్రధారుల్ని ధ్వంసం చేసింది’’ అని అన్నారు.

Tags

Next Story