BJP : లోక్​సభ ఎన్నికల్లో విజయం వైపు బిజేపి చూపు

BJP : లోక్​సభ ఎన్నికల్లో విజయం వైపు బిజేపి చూపు
400 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యం

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ...ఈసారి భారీ లక్ష్యాన్నే పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో 4వందల స్థానాలు గెలుపొందాలని నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీకి బలమైన అభ్యర్థులులేని చోట్లా ఇతరపార్టీలకు చెందిన కీలక నాయకులు, సిట్టింగ్‌ ఎంపీలను చేర్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమదే అధికారమని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్న కమలనాథులు...భారీ మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో 282 స్థానాలు గెలుపొందిన భారతీయ జనతా పార్టీ... 2019లో 303 మంది ఎంపీలు విజయం సాధించారు. ఈసారి 400 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇతర పార్టీలకు చెందిన కీలకనేతలు, సిట్టింగ్‌ ఎంపీలను చేర్చుకోవటంసహా ఇతర అన్నిమార్గాలను పరిశీలించాలని భావిస్తున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా అధ్యక్షతన మంగళవారం దిల్లీలో నిర్వహించిన వ్యూహాత్మక సమావేశంలో...ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో 400 స్థానాల లక్ష్యసాధన కోసం...వేర్వేరు బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శులకు...అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శులతోపాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్రప్రధాన్‌, భూపేంద్ర యాదవ్‌, అశ్వినీ వైష్ణవ్‌, మన్‌సుఖ్‌ మాండవియా తదితరులు పాల్గొన్నారు. అసోం సీఎం హిమంత బిస్వాశర్మ...వర్చువల్‌గా హాజరయ్యారు. 2024 ఎన్నికలకు సంబంధించి భాజపా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి రాధామోహన్‌ దాస్‌ అగర్వాల్‌కు అప్పగించారు. ఎన్నికల ప్రచారం, పబ్లిసిటీ, సంబంధిత ఇతర బాధ్యతలను సునీల్‌ బన్సల్‌, ఇతర ప్రధానకార్యదర్శులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న బౌద్ధులతో సమావేశాలు నిర్వహించి...నరేంద్రమోదీ సర్కార్‌ చేపడుతున్న కార్యక్రమాలను...దుష్యంత్‌ గౌతమ్‌ వివరించనున్నారు.

400 స్థానాల్లో గెలుపు లక్ష్య సాధనలో కీలకమైన చేరికల కమిటీ బాధ్యతలను ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డేకు...అప్పగించారు. ఇతరపార్టీలకు చెందిన సిట్టింగ్‌ ఎంపీలు, కీలక నేతలు భాజపాలోకి తీసుకొచ్చేందుకు ఉన్న అవకాశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో వారి ప్రభావం, విజయావకాశాల ఆధారంగా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను పార్టీలో చేర్చుకోవటంపై...ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అయితే తమకు బలమైన అభ్యర్థులు లేని చోట మాత్రమే ఇతర పార్టీల నేతలను చేర్చుకునే విషయాన్ని పరిశీలించనున్నట్లు భాజపావర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు ఓడిపోయిన 160 సీట్లపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు...Spot

1984లో కాంగ్రెస్‌ పార్టీ మొదటిసారి 4వందలకుపైగా స్థానాలు కైవసం చేసుకుంది. 2014లో ప్రధాని మోదీ సారథ్యంలోని భాజపా పూర్తి మెజార్టీ సాధించే వరకు...ఒక రాజకీయ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా పూర్తి మెజార్టీ సాధించటం అదే చివరిసారి

Tags

Next Story