Rahul Gandhi: కులం, మతం, మతం పేరుతో బీజేపీ దేశాన్ని విభజిస్తోంది : రాహుల్

Rahul Gandhi: కులం, మతం, మతం పేరుతో బీజేపీ దేశాన్ని విభజిస్తోంది : రాహుల్
అరుణాచల్ ప్రదేశ్ లో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర.

కులాలు, మతాలు, వర్గాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు రాజేసేందుకు భాజపా యత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అరుణాచల్ ప్రదేశ్ లో కొనసాగుతోంది. మతం, భాషల పేరుతో ప్రజలు కలహించుకునేలా భాజపా రెచ్చగొడుతోందని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం కాక,. కొందరు వ్యాపారవేత్తల కోసమే భాజపా పనిచేస్తుందని రాహుల్ మండిపడ్డారు. ప్రజల్ని ఐక్యంగా ఉంచడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి కాంగ్రెస్ పాటు పడుతోందన్నారు. భాజపా పాలనలో నిరుద్యోగం పెరిగిందనీ.. ప్రజల బాధలు వినడానికి భాజపా సిద్ధంగా లేదనీ.. చివరకు మీడియా కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని రాహుల్ విమర్శించారు.

ఈ నెల 14వ తేదీ నుండి భారత్ జోడో యాత్ర రెండవ దశ స్థార్ అయ్యింది. ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్ సభ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. 67 రోజుల పాటు.. 6,713 కిలోమీటర్లు పర్యటించనున్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఆయన అస్సోంలో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే రాహుల్‌కు షాక్ ఇచ్చింది మహారాష్ట్రలోని థానే కోర్టు. అసలు ఏం జరిగిందంటే.. 2017లో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యకు గురైన సంగతి విదితమే. కొంత మంది దుండగులు ఆమెను ఇంటి వద్ద కాల్చి చంపారు. అయితే ఈ ఘటనకు హిందూత్వ సంస్థ ఆర్ఎస్ఎస్‌కు సంబంధం ఉందని రాహుల్ ఆరోపించారని వార్తలు వెలువడ్డాయి. రాహుల్ వ్యాఖ్యలపై సంఘ్ పరివార్ కార్యకర్త వివేక్ ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

ఈ కేసు విచారణ సందర్భంగా వివరణ కోరింది కోర్టు. అయితే ఆయన వివరణ ఇవ్వలేదు. దీంతో సంజాయిషీ ఇవ్వడంలో జాప్యం చేసినందుకు రూ. 500 జరిమానా విధించింది. 881 రోజుల ఆలస్యానికి గానూ..ఈ ఫైన్ విధించింది మహారాష్ట్రలోని థానే ధర్మాసనం. కాగా, రాహుల్ తరుపు న్యాయవాది నారాయణ్ అయ్యర్ మాట్లాడుతూ.. తన క్లయింట్ ఢిల్లీలో ఉంటారని, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారని చెప్పారు. ఈ కారణంగానే సంజాయిషీ ఇవ్వడంలో లేటయ్యిందని పేర్కొనగా..వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు జస్ట్ జరిమానాతో సరిపెట్టేసింది. అయితే ఇదే సమయంలో రాత పూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొంది. సాధారణంగా పరువు నష్టం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముందుగా కోర్టుకు తన వివరణ సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత సాక్షుల విచారణ, క్రాస్ క్వశ్చన్ చేయడం ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story