UP Elections 2022: అయోధ్య నుంచి గోరఖ్‌పూర్‌ అర్భన్‌‌కు షిఫ్ట్ అయిన యోగిఆదిత్యనాథ్‌..

UP Elections 2022: అయోధ్య నుంచి గోరఖ్‌పూర్‌ అర్భన్‌‌కు షిఫ్ట్ అయిన యోగిఆదిత్యనాథ్‌..
UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి రెండు ఫేజ్‌ల్లో ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు లిస్ట్‌ను ప్రకటించింది. మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న స్థానాలకు 57మంది అభ్యర్థులను, రెండో దశ ఎన్నికలు జరుగుతున్న స్థానాలకు 48మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మరోవైపు యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్‌ స్థానం కూడా ఖరారైంది.

ఆయన గోరఖ్‌పూర్‌ అర్భన్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. మొదట ఆయన ఆయోధ్య నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పినా.. చివరకు ఆయన గోరఖ్‌పూర్‌ అర్భన్‌ నుంచి బరిలో నిలిచారు. ఆరో ఫేజ్‌లో ఉన్న గోరఖ్‌పూర్‌లో మార్చి 3న ఓటింగ్‌ జరుగుతుంది. ఇప్పడు ఈ ఎన్నికపై యావత్‌ దేశం ఆసక్తిగా చూస్తోంది. గోరఖ్‌పూర్‌లో పెద్దఎత్తున ముస్లిం ఓటర్లు ఉండగా.. బీజేపీ ఏ స్ట్రాటజీతో ఆయన్ను అక్కడ నిలబెట్టింది అన్నది ఆసక్తిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story