Bjp: 72 మందితో బీజేపీ రెండో జాబితా

Bjp: 72 మందితో బీజేపీ రెండో జాబితా
తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ 72 మంది సభ్యుల పేర్లతో రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌, అనురాగ్‌ ఠాకూర్‌, మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్‌ బొమ్మై, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, త్రివేంద్ర సింగ్‌ రావత్‌.. తదితరులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇప్పటివరకు మొత్తం 265 లోక్‌సభ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది.

తెలంగాణలో 6 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌ నేతగాని, మెదక్‌ నుంచి రఘునందన్‌ రావు, నల్లగొండ లోక్‌సభకు మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఆదిలాబాద్‌ గోడెం నగేష్‌, మహబూబాబాద్‌ నుంచి సీతారాం నాయక్‌ పేర్లను పార్టీ ప్రకటించింది. ఆరుగురు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

ఇటీవల 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ- తాజాగా 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్‌ హవేలీ (1) దిల్లీ (2), గుజరాత్‌ (7), హరియాణా(6), హిమాచల్‌ప్రదేశ్‌(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్‌ (5), మహారాష్ట్ర(20), త్రిపుర (1), ఉత్తరాఖండ్‌ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది.

రెండో జాబితాలో కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, ప్రహ్లాద్‌ జోషీ, పీయూష్‌ గోయల్‌, అనురాగ్‌ ఠాకూర్‌, శోభా కరంద్లాజేతో పాటు మాజీ సీఎంలు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, త్రివేంద్రసింగ్‌ రావత్‌, బసవరాజ్‌ బొమ్మై వంటి ప్రముఖులకు చోటు లభించింది. ఇక తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. ఆదిలాబాద్‌- గోడెం నగేశ్‌, పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్‌, మెదక్‌- రఘునందన్‌రావు, నల్లగొండ- శానంపూడి సైదిరెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌కు సీతారాం నాయక్‌ను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించింది బీజేపీ. తాజా ప్రకటనతో రాష్ట్రంలో మొత్తం 15 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారు. మిగతా 2 స్థానాలు (ఖమ్మం, వరంగల్‌) స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. కొద్దిరోజుల ముందే 195 అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది కమలం పార్టీ.

Tags

Next Story