Vice President Elections : బీజేపీ ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరంటే..

Vice President Elections : బీజేపీ ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరంటే..
Vice President Elections : రాష్ట్రపతి ఎన్నికకు వేళయింది. సోమవారమే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

Vice President Elections : రాష్ట్రపతి ఎన్నికకు వేళయింది. సోమవారమే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దాంతో అధికార, విపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. ప్రెసిడెంట్ ఓటింగ్ హీట్ ఉండగానే.. బీజేపీలో ఉపరాష్ట్రపతి రేసు మొదలైంది. ఉపరాష్ట్రపతి పోటీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో బీజేపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.

కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ కీలక సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ, అమిత్ షా సహా అగ్రనేతలు హాజరయ్యే ఈ భేటీలో బీజేపీ తరుపున నిలిచే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. వైస్ ప్రెసిడెంట్ రేసులో కేంద్ర మాజీమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కర్ణాటక గవర్నర్ థవర్‌చంద్ గెహ్లాట్, బీజేపీ మాజీ ఎంపీ వినయ్ సహస్ర బుద్దే, కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా ఉన్నారు. వీరిలో ఎవరిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags

Next Story