ఎన్నికల సమయంలోనే బీజేపీ ప్రజల పట్ల శ్రద్ధ చూపుతుంది: సీఎం స్టాలిన్

X
By - Prasanna |28 March 2024 12:05 PM IST
ఎన్నికల సమయంలోనే బిజెపి ప్రజల పట్ల శ్రద్ధ చూపుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి బిజెపిపై విరుచుకుపడ్డారు.
ఎన్నికల సమయంలోనే బిజెపి ప్రజల పట్ల శ్రద్ధ చూపుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ బుధవారం నాడు బిజెపిపై విరుచుకుపడ్డారు . ఇక్కడ జరిగిన డిఎంకె ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల కారణంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించిందని అన్నారు .
ఎన్నికల వేళ మాత్రమే బీజేపీ ప్రజల పట్ల శ్రద్ధ చూపుతుంది.. ఇప్పుడు పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గించి, గ్యాస్ ధరలను కూడా ఎన్నికల కోసమే తగ్గించింది.. ధరలు పెంచింది మోదీ ప్రభుత్వమే అయినా.. ఎన్నికల వేళ ఈ విధంగా వ్యవహరిస్తుంది. ధరల పెంపుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్టాలిన్ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com