Uttarakhand: ఉత్తరాఖండ్‌ బీజేపీదే.. 48 చోట్ల ఆధిక్యంతో..

Uttarakhand: ఉత్తరాఖండ్‌ బీజేపీదే.. 48 చోట్ల ఆధిక్యంతో..
Uttarakhand: దేవభూమి ఉత్తరఖండ్‌లో మరోసారి విజయం సాధించింది బీజేపీ.

Uttarakhand: దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసారి విజయం సాధించింది బీజేపీ. మొత్తం 70 స్థానాల్లో కమలం పార్టీ 48 చోట్ల ఆధిక్యం ప్రదర్శించింది. మ్యాజిక్ ఫిగర్ 36 ని దాటి సత్తా చాటింది. అయితే గత ఎన్నికల్లో 57 స్థానాల్లో గెలవగా ఈ సారి 9 స్థానాలు కోల్పోయి 48 స్థానాలకు పరిమితం కావడం విశేషం. బీజేపీ విజయంతో.. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు.

ఇక..ప్రస్తుత సీఎంగా ఉన్న పుష్కర్‌ సింగ్‌ ధామి ఓడిపోవడం బీజేపీకి నిరాశకల్గించింది. ఖతిమా నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో దాదాపు ఏడు వేల ఓట్లతో ఓడిపోయారు. బీజేపీ గెలిచినా.. సిట్టింగ్ సీఎం ఓడిపోవడం విశేషం.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 18కి పరిమితమైంది. అయితే .. 2017 ఎన్నికలో కాంగ్రెస్ 11 గెలుచుకోగా.. ఈ సారి మరో 7 స్థానాలు అధికంగా గెలవడం కాస్త ఊరట. అయితే.. ఆ పార్టీ సీఎం అభ్యర్ధి హరీశ్‌ రావత్‌ లాల్‌కాన్‌లో ఓడిపోవడం కాంగ్రెస్‌ని నిరాశపరిచింది.

శాయశక్తులా పోరాడినా పూర్తిస్థాయిలో ఉత్తరాఖండ్‌ ప్రజల మనసులను గెలుచుకోవడంలో వెనకబడ్డామన్నారు హరీష్‌ రావత్‌. కాంగ్రెస్‌ ఓటమికి బాధ్యత తీసుకుంటానన్నారు.

ఉత్తరాఖండ్ లో గత 21 ఏళ్లుగా ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఓసారి బీజేపీ గెలిస్తే, మరోసారి కాంగ్రెస్ గెలిచేది. కానీ ఈసారి ఆ ఆనవాయతీని బీజేపీ తిరగరాసింది. బీజేపీ రెండోసారి గెలిచింది. అయితే... ఒకే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థులు ఓడిపోవడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story