'బీజేపీ ఎజెండా పూర్తయింది': బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీ దేశం పగ్గాలు మరోసారి తన చేతుల్లోకి తీసుకోవాలనే ఆలోచనలు.. వెరసి రోజుకో కొత్త ప్రకటన. ఇప్పుడు రాజకీయ కురువృద్దుడికి భారత రత్న ప్రకటించడం ఆ కోవలోకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకురాలు అద్వానికి భారతరావడం పట్ల తనదైన శైలిలో స్పందించారు.
బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతరత్న ప్రకటించడంపై బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవిత స్పందించారు. ఆ పార్టీ ‘ఎజెండా’ ఇప్పుడు పూర్తవుతోంది. అద్వానీకి భారతరత్న ఇచ్చినందుకు అభినందనలు...రామ మందిరం కట్టడం, అద్వానీకి భారతరత్న ఇవ్వడం విశేషం. బీజేపీ ఎజెండా పూర్తయినట్లేనని ఆమె అన్నారు.
" ఎల్‌కె అద్వానీ గురించి బీజేపీ మరియు పీఎం మోడీ చాలా ఆలస్యంగా ఆలోచించారు. అతను ఉన్నతమైన నాయకుడు. ఈ రోజు బీజేపీ ఉన్న స్థానం - దాని పునాది ఎల్‌కె అద్వానీ ద్వారా పడింది ... బీజేపీ అంతటి మహోన్నత నేతతో ప్రవర్తించిన తీరు బాగాలేదు. ఆయనకు భారతరత్న రావడం ఆనందదాయకం. ఆయనకు శుభాకాంక్షలు' అని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు.
1990వ దశకంలో రామమందిర రథయాత్రతో బీజేపీని జాతీయ స్థాయికి చేర్చిన ఘనత ఎల్‌కె అద్వానీకి ఉంది. ఎల్‌కే అద్వానీని బీజేపీ అభినందించింది. దేశానికి అద్వానీ చేసిన సేవలను బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కొనియాడారు.
"మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము...అన్ని కష్టాలను ఎదుర్కొని దేశంలో సాంస్కృతిక జాతీయవాదం అనే పతాకాన్ని ఎగురవేశారు అద్వానీ. దేశాన్ని జాతీయవాదంతో అనుసంధానించారు. ఆయన వ్యక్తిత్వం యావత్ దేశానికి ఒక పాఠం వంటిది అని అన్నారు.
"మా స్ఫూర్తికి మూలం" లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడం యావత్ దేశానికి గర్వకారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్‌లో .. “లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రదానం చేయాలనే నిర్ణయం దశాబ్దాలపాటు దేశానికి ఆయన చేసిన సేవకు గుర్తింపు అని పోస్ట్ చేశారు.
నిరాడంబరమైన వ్యక్తిగా రాజకీయాల్లో ఎదగడం ఈ తరం రాజకీయ నాయకులకు ఓ ఉదాహరణ అని హిమంత బిస్వా శర్మ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com