Black Fungus: భారత్‌లో మళ్లీ బ్లాక్ ఫంగస్ కలకలం.. యూపీలో తొలి కేసు..

Black Fungus: భారత్‌లో మళ్లీ బ్లాక్ ఫంగస్ కలకలం.. యూపీలో తొలి కేసు..
Black Fungus: మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.

Black Fungus: దేశంపై మరోసారి కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తున్నాయి. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. అసలే కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతుంటే.. ఇప్పుడు మళ్లీ బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది.

మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. కాంట్‌ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని జీఎస్‌వీఎం ఆస్పత్రి వైద్యులు అన్నారు. బాధితుడి ఒక కన్ను, ముక్కుకు బ్లాక్ ఫంగస్ వ్యాపించిందని, కరోనా థర్డ్‌వేవ్‌లో ఇదే తొలి కేసు అని తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ బెంబేలెత్తించింది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి.

ఫంగస్‌ కారణంగా పలువురు కంటి చూపును సైతం కోల్పోయారు. మరోసారి బ్లాక్ ఫంగస్ కేసు నమోదవడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్.. తాజాగా మళ్లీ బ్లాక్ ఫంగస్‌ దడ పుట్టిస్తుండం ప్రజలు హడలెత్తిపోతున్నారు. వైద్య నిపుణలు మాత్రం.. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Tags

Next Story