జాతీయ

Bihar: డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో సోదాలు.. కళ్లు చెదిరే డబ్బుతో పాటు మరెన్నో..

Bihar: బిహార్‌ పాట్నాలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేంద్ర కుమార్‌ ఇంట్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

Bihar: డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో సోదాలు.. కళ్లు చెదిరే డబ్బుతో పాటు మరెన్నో..
X

Bihar: బిహార్‌ పాట్నాలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేంద్ర కుమార్‌ ఇంట్లో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే నగదు, ఆస్తుల పత్రాలు వెలుగు చూశాయి. మూడు కోట్ల విలువైన నగదుతో పాటు కిలోకు పైగా బంగారం, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 5 లగ్జరీ వెహికిల్స్‌తో పాటు బినామీల పేరిట ఆస్తులను గుర్తించారు. శుక్రవారం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ జితేంద్ర కుమార్‌పై కేసు నమోదైంది.

దీంతో శనివారం జితేంద్ర కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు. డే మొత్తం సోదాలు కొనసాగాయి. జెహనాబాద్‌లోని ఇంటితో పాటు గయా పట్టణంలోని ఫ్లాట్స్‌, దానాపూర్‌లోని ఫార్మాసి కాలేజీ, పట్నాలో కొత్తగా నిర్మించిన ఇంటిలోనూ సోదాలు జరిపారు అధికారులు. జితేంద్ర కుమార్ 2011లో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం పాట్నాలో విధులు నిర్వహిస్తున్న ఆయన..సొంతంగా ఫార్మసీ కాలేజీని నిర్వహిస్తున్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES