జాతీయ

Punjab: పంజాబ్‌ పోలీస్ ఇంటెలిజెన్స్‌ ఆఫీసులో భారీ పేలుడు.. రాష్ట్రంలో హైఅలర్ట్..

Punjab: మొహాలీలో పంజాబ్‌ పోలీస్ ఇంటెలిజెన్స్‌ కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది.

Punjab: పంజాబ్‌ పోలీస్ ఇంటెలిజెన్స్‌ ఆఫీసులో భారీ పేలుడు.. రాష్ట్రంలో హైఅలర్ట్..
X

Punjab: మొహాలీలో పంజాబ్‌ పోలీస్ ఇంటెలిజెన్స్‌ కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది. మూడవ అంతస్తులోని ఓ భవనం లక్ష్యంగా రాకెట్ దాడి చేశారు. ఈ ఘటనలో ఆఫీసు అద్దాలు, తలుపులు ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడుతో మొహాలీలో హైటెన్షన్ నెలకొనగా.. పంజాబ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఇది ఉగ్రదాడి కాదని, రాకెట్ దాడి చేశారని పోలీసులు తెలిపారు. మరోవైపు పేలుడు ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌.. పోలీసు ఉన్నతాధికారులను సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.

Next Story

RELATED STORIES