Bobby Kataria : విమానంలో సిగరెట్ తాగిన బాబీ కటారియా.. ఎలా కవరింగ్ ఇచ్చాడంటే..?

Bobby Kataria : విమానంలో సిగరెట్ తాగిన బాబీ కటారియా.. ఎలా కవరింగ్ ఇచ్చాడంటే..?
Bobby Kataria : స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగి పోలీసు కేసును ఎదుర్కొంటున్న ఘటనపై బాబీ కటారియా క్లారిటీ ఇచ్చాడు.

Bobby Kataria : స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగి పోలీసు కేసును ఎదుర్కొంటున్న ఘటనపై బాబీ కటారియా క్లారిటీ ఇచ్చాడు. తాను సిగరెట్ తాగింది నిజమైన విమానంలో కాదని.. అది డమ్మీ విమానం అని చెకప్పుకచ్చాడు. దుబాయ్‌లో ఓ షూటింగ్‌లో భాగంగా చేసిందన్నాడు. అయితే, ఈ ఘటనపై స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ఇచ్చిన వివరణకు బాబీ కటారియా వాదన పూర్తి విరుద్దంగా ఉంది. ఈ ఘటన జనవరిలో తమ విమానంలో జరిగిందని స్పైస్ జెట్ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా విచారించామని, గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.

'ఈ వీడియో ఈ ఏడాది జనవరి 20 న దుబాయ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎస్జీ 706 విమానంలో ప్రయాణికులు ఎక్కుతుండగా చిత్రీకరించారని స్పైస్ జెట్ వెల్లడించింది. క్యాబిన్ సిబ్బంది ఆన్-బోర్డింగ్ చేయడంలో నిమగ్నమై ఉన్నప్పుడు 21వ వరుసలో ఉన్న సదరు ప్రయాణికుడు, అతని సహ-ప్రయాణికులు ఈ వీడియోను చిత్రీకరించారని చెబుతున్నారు. దీని గురించి ఇతర ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా ద్వారా జనవరి 24న ఈ విషయం తమదృష్టికి వచ్చిందని స్పైస్ జెట్ తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. అటువంటి ప్రమాదకర ప్రవర్తనను సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.



Tags

Read MoreRead Less
Next Story