Chitra Purushotham: ప్రీ వెడ్డింగ్ షూట్‌లో కండ‌లరాణి చిత్రా స్ట‌న్నింగ్ లుక్‌

Chitra Purushotham:  ప్రీ వెడ్డింగ్ షూట్‌లో కండ‌లరాణి చిత్రా స్ట‌న్నింగ్ లుక్‌
X
కంచిప‌ట్టు చీర‌లో కండ‌లరాణి ఫొటోలు వైర‌ల్‌

క‌ర్నాట‌క బాడీబిల్డ‌ర్ చిత్రా పురుషోత్తం ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో హాట్ టాపిక్ అయ్యారు. ఆ కండ‌ల రాణి.. త‌న పెళ్లి కోసం ప్రిపేర‌వుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో నిర్వ‌హించిన‌ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్న‌ది. కంచిప‌ట్టు చీర క‌ట్టి.. ఆ చీర క‌ట్టులో కండ‌ల్ని ప్ర‌ద‌ర్శిస్తున్న చిత్రా పిక్స్‌, వీడియోలు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఎల్లో, బ్లూ రంగు ప‌ట్టు చీర‌లో చిత్ర చాలా సంప్ర‌దాయ‌మైన రీతిలో త‌న లుక్‌ను ప్ర‌జెంట్ చేసింది.

అయితే బ్లౌజ్ లేకుండా ఉన్న ఆ పిక్స్‌లో .. బాడీబిల్డ‌ర్ చిత్ర త‌న కండ బ‌లాన్ని చూపించింది. బాడీ బిల్డ‌ర్ చిత్ర‌..ఓ బ్యూటీ క్వీన్‌లా త‌యారైంది. బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించింది. నెక్లెస్‌లు, చేతి గాజులు వేసుకున్నాయి. చెవి పోగులు కూడా ధ‌రించింది. ఎర్ర‌టి పెద‌వుల‌తో .. త‌నలో పెళ్లి క‌ళ‌ను ఆ లుక్‌తో ఆమె చాటుకున్న‌ది. చాలా భిన్న‌మైన రీతిలో ఆ ప్రి వెడ్డింగ్ ఫోటోషూట్ జ‌రిగింది.

చిత్ర పోస్టు చేసిన త‌న వీడియోకు 34 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఇంకా చాలా మంది త‌మ రియాక్ష‌న్స్‌తో థ్రిల్ చేశారు. ఆమె ఫిట్‌నెస్‌ను అనేక మంది మెచ్చుకున్నారు. కొంద‌రైతే న‌వ్వుకుంటున్న‌ట్లు కూడా రిప్లైలు ఇచ్చారు. వ‌ధువు అలంక‌ర‌ణ‌తో పాటు బాడీబిల్డింగ్ ప‌త‌కాలు కూడా ఆమె ధ‌రిస్తే మంచిదే అన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. చిత్ర‌లో ఉన్న కాన్ఫిడెన్స్‌, డెడికేష‌న్‌ను అనేక మంది ప్ర‌శ్నించారు.

Tags

Next Story