International Yoga Day 2023: యోగాతో అందం, ఆరోగ్యం : బాలీవుడ్‌ భామలు

International Yoga Day 2023: యోగాతో అందం, ఆరోగ్యం : బాలీవుడ్‌ భామలు


ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేసే విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు వారికి వారే సాటి. ముఖ్యంగా యోగాతో శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తీసుకునే ఆహారం నుంచి జిమ్‌లో చెమటోడ్చడం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. నటీనటులు ఫిట్‌గా ఉండటానికి సాధ్యమైన కృషి చేస్తారు. నిజానికి చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ యోగా చేస్తుంటారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను తమ జీవనశైలిలో భాగం చేసుకుని, యువతను యోగా వైపు అడుగులు వేయిస్తున్న హీరోయిన్లూ బాలీవుడ్‌లో ఉన్నారు

1. మలైకా అరోరా

మలైకా అరోరా యోగా అంటే మహా ఇష్టం. ఆమె వయస్సు 49 అయినప్పటికీ యోగా, జిమ్‌ చేస్తూ యంగ్‌గా కనిపిస్తుంది. నేటి తరానికి యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని ఆరాటపడే సెలబ్రెటీల్లో ఆమె ఒకరు. ముంబైలో దివా యోగా సెంటర్ పేరుతో సొంతంగా యోగా స్టూడియో కూడా నడుపుతూ యోగా పట్ల ఇష్టాన్ని చాటుతోంది. ఇన్స్‌టాగ్రామ్‌లో భిన్నమైన యోగాసనాలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.





2. శిల్పాశెట్టి

నటి శిల్పాశెట్టి కూడా యోగా ఫ్రీక్. యోగా అనగానే చాలా మందికి తట్టే మొదటి పేరు శిల్పా. ఆమె యోగా డీవీడీలను విడుదల చేసి యోగా పట్ల తన అభిమానాన్ని చాటుకుంది. ఆమె వయస్సు 48, అయినా యవ్వనంగా కుర్రాల చూపలను కట్టిపడేసే అందం తన సొంతం అందుకు కారణం యోగానే అని చెప్పిందీ యోగా సుందరీ. సొంత యోగా వెల్నెస్ ఛానెల్‌ని కూడా ప్రారంభించి యువతను ఆసనాల వైపు ఆకర్షిస్తోంది.





3. కరీనా కపూర్ ఖాన్

కరీనా కూడా యోగాను తన జీవితంలో భాగం చేసుకుంది. అనేక ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ప్రసవానంతరం ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో యోగా ఎలా ఉపయోగపడిందో వివరంగా చెప్పుకొచ్చింది. కరీనాకు ఒక క్యూటెస్ట్‌ యోగా పార్టనర్‌ కూడా ఉన్నారు. కొడుకు జెహ్ కూడా ఆమె యోగా సెషన్స్‌లో అమ్మతో కలిసి యోగా ఆసనాలు వేస్తున్నాడు.






4. బిపాసా బసు

బిపాసా బసు ఏళ్లుగా యోగా సాధన చేస్తోంది. యోగా ఫిట్‌నెస్ DVDలను ఆమె స్వయంగా విడుదల చేసింది. యోగా మానసిక ప్రశాంతత, ఉల్లాసానికి దోహపడుతుందని బసు అభిప్రాయపడ్డారు. ఆమె తరచుగా తన భర్త, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి యోగా చేసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ యోగాను కపుల్‌ గోల్స్‌గా మార్చేసింది.





సెలబ్రెటీలే కాదు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడం ప్రతి ఒక్కరికీ అవసరమే. అనవసరమైన జబ్బుల బారిన పడకుండా ప్రశాంతమైన జీవితం గడిపేందుకు మీరూ మీ డైలీ రొటీన్‌లో యోగా సాధనను యాడ్‌ చేసేయండి మరి.

Tags

Read MoreRead Less
Next Story