Bengaluru : బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్..
బెంగూళురులోని 15 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించి నకిలీవని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.
బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు అందాయి. దాదాపుగా అరగంట వ్యవధిలో 15కు పైగా పాఠశాలలకు బెదిరింపు ఇ-మెయిల్స్ అందాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఉదయం 8 గంటల సమయంలో పాఠశాలలు తెరచుకున్న కొద్దిసేపటికే ఈ మెయిల్స్ అందాయి. ఆయా పాఠశాలలన్నీ బసవేశ్వర నగర, యలహంక, సదాశివ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్నాయి. మొత్తంగా ఏకకాలంలో15 పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తేలింది. దీంతో అలర్ట్ అయిన స్కూల్స్ యాజమాన్యాలు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం పంపించి విద్యార్థులను ఇళ్లకు పంపించాయి. బాంబులు పెట్టారనే విషయం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లారు. వెంటనే స్కూల్స్‌కు చేరుకొని తమ పిల్లలు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థించారు. పిల్లలంతా క్షేమంగా బయటకు వచ్చేంత వరకు అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. బసవేశ్వర నగర్, సదాశివనగర్ ప్రాంతాల్లోని స్కూల్స్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.
మరోవైపు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని పోలీసులు సూచించారు. ఇవి తప్పుడు ఈమెయిల్స్ కావచ్చని అనుమానిస్తున్నారు. ఆ ఈమెయిల్స్ ఎవరు పంపించారనే దాన్ని ఆరా తీస్తున్నారు. కర్నాటక హోంమంత్రి DK శివకుమార్ తన ఇంటి సమీపంలోని నీవ్ అకాడమీ స్కూల్‌ను సందర్శించారు. ఇవి ఉత్తుత్తి ఈమెయిల్స్ అయి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఈమెయిల్ పంపిన వారిని 24 గంటల్లో అదుపులోకి తీసుకుంటామని ప్రకటించారు.
పాఠశాలలకు బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. సదాశివ నగర్‌లోని నీవ్ అకాడమీ పాఠశాలను సందర్శించారు. పోలీసులతో మాట్లాడారు. టీవీ ద్వారా ఈ సమాచారం తనకు తెలిసిందని, వెంటనే తన ఇంటికి దగ్గరలో ఉన్న నీవ్ పాఠశాలకు వచ్చానని అన్నారు. AD ఈ ఘటనపై బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బీ దయానంద.. స్పందించారు. పిల్లలు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారని పేర్కొన్నారు. సంఘటన స్థలంలో పోలీసులను మోహరింపజేసినట్లు వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com