Bomb threat : ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు..

Bomb threat :  ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు..
X
మూడు చోట్ల పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ మెయిల్‌. .. డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా పాఠశాలల లక్ష్యంగా ప్రతిరోజూ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టుకు బాంబ్ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్స్‌ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.

హైకోర్టుకు బెదిరింపులు రాగానే న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రాంగణాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఢిల్లీ హైకోర్టుకు ఈ మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి తనిఖీలు చేపట్టారు.

ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం..కోర్టు ప్రాంగణంలో మూడు బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 2 గంటలలోపు ఖాళీ చేయాలని ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు తెలిపారు. అయితే సందేశంలో పేలుడు పదార్థాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. ప్రస్తుతం బాంబ్, డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.

గత నెలలో కూడా వరుసగా ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థుల, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చి తనిఖీలు చేపట్టేవారు. దీంతో క్లాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా న్యాయస్థానాలకు పాకింది.

Tags

Next Story