బాంబే హైకోర్టులో న‌టి కంగ‌నాకు ఊరట

బాంబే హైకోర్టులో న‌టి కంగ‌నాకు ఊరట
బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కు బాంబే హైకోర్టులో ఊరట కలిగింది. ఆమె కార్యాలయాన్ని బృహ‌న్‌ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్..

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కు బాంబే హైకోర్టులో ఊరట కలిగింది. ఆమె కార్యాలయాన్ని బృహ‌న్‌ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) సిబ్బంది బుధవారం కూల్చుతున్న విషయం తెలిసిందే. అయితే కూల్చివేతను ఆపాలని బొంబాయి హైకోర్టు బిఎంసిని ఆదేశించింది.. అలాగే ఆమె పిటిషన్‌పై స్పందించాలని బీఎంసీకి సూచించింది. ఈ విషయంపై రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరగనుంది. కాగా కంగనాకు చనిదినా బాంద్రా బంగ్లాలో అక్రమంగా మార్పులు చేశారని బీఎంసీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Tags

Next Story